చాలా సార్లు ముఖానికి వాడే సహజ క్రీముల్లో నిమ్మకాయ రసాన్ని కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. అయితే.. నిజానికి నిమ్మకాయ రసాన్ని ముఖానికి డైరెక్ట్ గా అప్లై చేయకూడదట. అలా రాయడం వల్ల ముఖం పాడైపోతుందట. ఎందుకంటే దీనిలో యాసిడ్ గుణాలు అధికంగా ఉంటాయి. దీనిని నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం సమతుల్యత దెబ్బతింటుంది.ఫలితంగా దురద, దద్దుర్లు, మంట తదితర సమస్యలు కలుగుతాయి.