Published : Oct 26, 2021, 12:28 PM ISTUpdated : Oct 26, 2021, 12:47 PM IST
సినిమాల్లో సాయి పల్లవి పెద్దగా మేకప్ కూడా వేసుకోదు. చాలా నేచురల్ గా కనపడుతుంది. అయితే.. ఆమె అంత నేచురల్ గా, ఎనర్జిటిక్ గా ఉండటానికి... తన ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి డ్యాన్స్ చేస్తూ ఉంటుందట. తన సీక్రెట్ డ్యాన్స్ అని ఆమె చెప్పడం గమనార్హం.
టాలీవుడ్ లో వరస అవకాశాలతో దూసుకుపోతున్న నటి సాయి పల్లవి. ఆమె ఏ సినిమాలో నటించినా.. క్రేజ్ అంతా ఆమెకే ఎక్కువగా దక్కుతుంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్స్ అవసరం లేదు.
211
ఇటీవల ఆమె నటించిన లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ లకు అందరూ ఫిదా అయిపోయారు. డ్యాన్స్ చేసేటప్పుడు ఆమె శరీరం విల్లులాగా వంగుతుందనే విషయం మనందరికీ తెలుసు.
311
అసలు.. సాయి పల్లవి బాడీ అంత ఫ్లెక్సిబుల్ గా ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉండే ఉంటుంది. తన శరీరాన్ని అలా కాపాడుుకోవడానికి సాయి పల్లవి ఏం చేస్తుందో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం.
411
సినిమాల్లో సాయి పల్లవి పెద్దగా మేకప్ కూడా వేసుకోదు. చాలా నేచురల్ గా కనపడుతుంది. అయితే.. ఆమె అంత నేచురల్ గా, ఎనర్జిటిక్ గా ఉండటానికి... తన ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి డ్యాన్స్ చేస్తూ ఉంటుందట. తన సీక్రెట్ డ్యాన్స్ అని ఆమె చెప్పడం గమనార్హం.
511
దాదాపు హీరోయిన్లు అందరూ తమ ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి జిమ్ ల వెంట పరిగెడుతూ ఉంటారు. అయితే... మీరు నమ్మరు కానీ.. సాయి పల్లవి మాత్రం ఇప్పటి వరకు జిమ్ కి వెళ్లలేదట. కేవలం డ్యాన్స్ తోనే ఆమె అంత ఫిట్ గా ఉంటారట.
611
అలా అని డ్యాన్స్ కూడా ప్రొఫెషనల్ గా నేర్చుుకోలేదట. తన చిన్నతనం నుంచి తనంతట తానే ఓంటరిగా నేర్చుకుందట. ఆమెకు డ్యాన్స్ అంటే ఎక్కువ ఇష్టం. దానితోనే.. తన బాడీని చాలా ఫ్లెక్సిబుల్ గా మలుచుకుందట.
711
డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరుగుతాయి అనే విషయం మనకు తెలిసిందే. అయితే.. సాయి పల్లవి.. చెమటలు కక్కే వరకు డ్యాన్స్ చేస్తుందట. ప్రతి రోజూ.. ఆమె కచ్చితంగా డ్యాన్స్ చేస్తుందట. వర్కౌట్స్ చేయడం ఇష్టం లేనివారు డ్యాన్స్ చేయవచ్చట.
811
ప్రతిరోజూ అరగంట డ్యాన్స్ చేయడం వల్ల దాదాపు 200 నుంచి 400 కేలరీలు బర్న్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
911
డ్యాన్స్ చేయడం వల్ల ఎయిరోబిక్ ఫిట్నెస్ బాగా ఇంప్రూవ్ అవుతుందట. మజిల్ బాగా గట్టిపడతాయి. అందుకే ఆమె ఎప్పుడూ చాలా చురుకుగా ఉండటానికి, తాజాగా కనపడటానికి సహాయపడుతుంది.
1011
అంతేకాదు.. సాయి పల్లవి తన డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందట. ఆమె అసలు మాంసం ముట్టదట. కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తింటుందట. ప్లాంట్ బేస్ డ్ డైట్ తీసుకుంటానని ఆమె చలా సార్లు చెప్పారు.
1111
ఇక సాయి పల్లవి ఎక్కువగా యోగా, మెడిటేషన్ చేస్తూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీని తరిమేయడానికి ఈ రెండు ఎంతగానో సహాయపడతాయి. అందుకే.. రిలాక్స్ అవ్వడానికి ఆమె యోగా మాత్రం కచ్చితంగా చూస్తుందట.