బరువు తగ్గాలంటే నూనెలను పూర్తిగా మానేయాలా? మంచిదేనా?

First Published Oct 5, 2021, 2:10 PM IST

బరువు తగ్గాలని వెయిట్ లాస్ రెజీమ్స్ ఫాలో అవుతున్నవారు తమ ఆహారం నుంచి నూనెలను పూర్తిగా తొలగిస్తారు. దీనివల్ల తొందరగా బరువు తగ్గాలన్న తమ లక్ష్యాలను చేరుకుంటామని అనుకుంటారు. అయితే ఇది నిజమేనా? ఆహారంలో పూర్తిగా నూనెలను తొలగించడం మంచిదేనా? దీనివల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలుంటాయి? ఇప్పుడు చూద్దాం. 

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి వల్ల గుండె జబ్బులు, రక్తపోటుతో బాధపడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. దీనిని నియంత్రించడానికి రిఫైన్డ్ నూనెలు, నెయ్యిలకు బదులుగా ఆలివ్ ఆయిల్ లేదా ఆవ నూనెకు మారుతున్నారు. 

దీంతోపాటు బరువు తగ్గాలని వెయిట్ లాస్ రెజీమ్స్ ఫాలో అవుతున్నవారు కూడా తమ ఆహారం నుంచి నూనెలను పూర్తిగా తొలగిస్తారు. దీనివల్ల తొందరగా బరువు తగ్గాలన్న తమ లక్ష్యాలను చేరుకుంటామని అనుకుంటారు. అయితే ఇది నిజమేనా? ఆహారంలో పూర్తిగా నూనెలను తొలగించడం మంచిదేనా? దీనివల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలుంటాయి? ఇప్పుడు చూద్దాం. 

ఆరోగ్య నిపుణులు చెప్పేదాన్ని బట్టి ఆహారంలో పూర్తిగా నూనెలను తగ్గించడం వల్ల తొందరగా అలసిపోతారు. తరచుగా అనారోగ్యానికి గురవుతారు. కారణం ఏంటంటే.. శరీరానికి కొవ్వులు అవసరం. మెదడు, న్యూరాన్ వ్యవస్థ, నరాలు, ప్రసరణ వ్యవస్థ అన్నీ కొవ్వుల మీద ఆధారపడే పనిచేస్తాయి. అందువల్ల, తప్పనిసరిగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. సమతుల ఆహారం అంటే అందులో నూనెలు కూడా ఉంటాయి. కానీ పరిమిత పరిమాణంలో ఉంటాయి. 

ట్రాన్స్ ఫాట్స్ ను అవాయిడ్ చేయ్యాలి. అంటే బజార్లో దొరికే ఆహార పదార్థాల్లో ఒకసారి వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడతారు, అధిక మంట మీద నూనెను వేడ చేస్తారు. వీటిల్లో ట్రాన్స్ ఫ్యాట్లు అధికంగా ఉంటాయి. 

మరి రోజుకు ఎంత నూనెలు తీసుకోవాలి అంటే.. ప్రతిరోజూ 2-3 చెంచాల నెయ్యి, ఆవనూనె లేదా ఆలివ్ నూనెలను తీసుకోవచ్చు. ఆహారపదార్థాల్లో అత్యంత మంచి నూనె అంటే ఆవనూనె

నూనెలను పూర్తిగా ఎందుకు అవాయిడ్ చేయకూడదు అంటే.. నూనెలు  లేకుండా ఆహారాన్ని తినడం వల్ల బరువు తగ్గవచ్చు. కానీ తొందరగా అలసిపోతారు. అనారోగ్యాల బారిన పడతారు. నూనెలు వాడకపోవడం వల్ల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకమైన కొవ్వులు అందకుండా పోతాయి. 

ఫ్యాడ్ డైట్స్ కు నో చెప్పండి : ఫ్యాడ్ డైట్స్ శరీరాన్ని చాలా ఒత్తిడికి గురిచేస్తాయి. దీని వలన బరువు తగ్గుతారు. ఈ డైట్ లో తీసుకునే ఆహారం వల్ల అవాంఛిత ఒత్తిడి కలుగుతుంది. అందుకే దీన్ని దీర్ఘకాలంలో అనుసరించలేం. ఇవి బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి, కానీ దీర్ఘకాలంలో ఇది నిలకడగా ఉండదు.

వంటలకోసం ఏ నూనెలు మంచివి? అంటే.. మొదట చెప్పుకునేది.. 
ఆలివ్ నూనె : ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్. ఈ నూనెలో ప్రాథమిక ఆమ్లం మోనోశాచురేటెడ్ కొవ్వు, దీనిని ఒలేయిక్ యాసిడ్ అని కూడా అంటారు. యాంటీకాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

olive oil

ఆలివ్ నూనెలో ఒలియోకాంతల్, ఒల్యూరోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను ఆక్సీకరణం చెందకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ఆలివ్ నూనెలో గుండెకు ఆరోగ్యకరమైన సమ్మేళనాలు ఉన్నాయి. ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 డయాబెటిస్ వంటి పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది.

ఆవ నూనె : ఆవనూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.. అందుకే వంట కోసం ఆరోగ్యకరమైన ఎంపిక. కాకపోతే.. అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసిన నూనెను తిరిగి ఉపయోగించకుండా చూసుకోవాలి.

నెయ్యి :  నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. కొవ్వును మితంగా తినాలి.  అయితే అధ్యయనాల్లో నెయ్యి వంటి కొవ్వు పదార్ధాలు తినడం వల్ల అవసరమైన విటమిన్లు, ఖనిజాలను ఆహారం నుండి గ్రహించడంలో సహాయపడతాయని తేలింది. అందువలన, నెయ్యితో చేసిన ఆహారాల వల్ల ఎక్కువ పోషకాలను గ్రహించవచ్చు.

click me!