Red Wine: చలికాలంలో ప్రతిరోజూ రెడ్ వైన్ తాగితే మంచిదా?

Published : Dec 28, 2025, 07:48 PM IST

Red Wine: రెడ్ వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహం ఎంతో మందిలో ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో రెడ్ వైన్ తాగే వారి సంఖ్య ఎక్కువ.  రెడ్ వైన్‌లో 'పాలీఫెనాల్స్' అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  అయితే రెడ్ వైన్ ఎవరు తాగకూడదు? ఎందుకు తాగకూడదు?

PREV
14
చలికాలంలో రెడ్ వైన్

చలికాలం వచ్చిందంటే శరీరానికి వేడి కలిగించే ఆహారాన్ని తినాల్సిన అవసరం ఉంది. కొంతమంది చలి నుంచి తప్పించుకోవడానికి ఆల్కహాల్ తాగడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా రెడ్ వైన్ తాగేవారి సంఖ్య అధికంగా ఉంది. ఇది ఆరోగ్యానికి మంచిదేనా కాదా అనే సందేహం కూడ వినిపిస్తోంది. వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం రెడ్ వైన్ తాగడం వల్ల కొన్ని లాభాలు ఉన్నట్టే, కొన్ని నష్టాలు ఉన్నాయి. కొంతమంది రెడ్ వైన్ తాగకూడదు. రెడ్ వైన్ తయారీలో ద్రాక్ష గుజ్జు, ద్రాక్ష గింజలు  వాడతారు. వీటిలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. 

24
రెడ్ వైన్ తాగడం వల్ల లాభాలు

రెడ్ వైన్‌లో రిస్వెరాట్రోల్ అనే యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చలికాలంలో రక్త ప్రసరణ మందగించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో తక్కువ మోతాదులో రెడ్ వైన్ తీసుకుంటే రక్తప్రసరణ కొంత వరకు చురుగ్గా జరుగుతుందని. అలాగే రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. కొందరిలో జీర్ణక్రియ మెరుగుపడటం, చలి వల్ల కలిగే ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు కనిపించవచ్చు.

34
ఎంత తాగొచ్చు

రెడ్ వైన్ తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని అధికంగా తాగితే మాత్రం మంచిది కాదు. ప్రతిరోజూ రెడ్ వైన్ తాగడం అలవాటుగా మారితే అది ఆల్కహాల్ కు వ్యసనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాలేయం, పొట్ట, నరాల వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. కాబట్టి రోజూ తాగడం అనేది సరైన భావన కాదు. రెడ్ వైన్ తాగినా చాలా పరిమితంగా తీసుకోవాలి. రోజుకు ఒక చిన్న గ్లాసుతో రెడ్ వైన్ తాగడం మంచిది. అంతకుమించి తాగకపోవడమే ఉత్తమం. రెడ్ వైన్‌లో ఆల్కహాల్ కొంతవరకు ఉంటుంది. దీన్ని ఎక్కువగా తాగితే లివర్ సిర్రోసిస్, హెపటైటిస్, మెదడు సమస్యలు, నోరు, గొంతు, రొమ్ము క్యాన్సర్, అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులు రావచ్చు.

44
ఎవరు రెడ్ వైన్ తాగకూడదు?

ప్రతి ఒక్కరికీ రెడ్ వైన్ సరిపడాలని లేదు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనికి పూర్తిగా దూరంగా ఉంటే మంచిది. కాలేయ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్ సమస్యలు ఉన్నవారు దీన్ని తాగకపోవడమే ఉత్తమం. అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే తాగాలి. మందులు వాడుతున్నవారు, ముఖ్యంగా నిద్ర మాత్రలు లేదా మానసిక ఒత్తిడికి సంబంధించిన మందులు తీసుకునేవారు రెడ్ వైన్ తాగడం ఏమాత్రం మంచిది కాదు. ద్రాక్ష రసంలో కూడా పాలీఫెనాల్స్ ఉంటాయి. కానీ వైన్ తయారీ ప్రక్రియలో వాటి పరిమాణం పెరుగుతుంది. ఆల్కహాల్ వద్దనుకునే వారికి ద్రాక్ష లేదా వాటి రసం మంచి ఎంపిక.

Read more Photos on
click me!

Recommended Stories