Bathing: రోజూ స్నానం చేస్తే ప్రమాదమా.? మూడు రోజులకు ఒకసారి చేస్తే ఏమవుతుంది..

Published : Feb 06, 2025, 12:26 PM IST

మన దైనందిక కార్యక్రమాల్లో స్నానం ప్రధానమైంది. ఉదయం లేవగానే చేసే పనుల్లో స్నానం ప్రధానమైంది. అయితే ప్రతీరోజూ స్నానం చేయడం వల్ల ఆరోగ్యంపై ఏదైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందా.? అసలు నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
Bathing: రోజూ స్నానం చేస్తే ప్రమాదమా.? మూడు రోజులకు ఒకసారి చేస్తే ఏమవుతుంది..
Bathing in cold water

కచ్చితంగా రోజూ స్నానం చేయాలని చెబుతుంటాం. ఇది మంచి అలవాటుగా చిన్నప్పటి నుంచి బోధిస్తుంటాం. ఇక సమ్మర్‌లో అయితే రోజూ రెండుసార్లు కూడా స్నానం చేస్తుంటారు. అయితే ప్రతీరోజూ స్నానం చేయడం మంచిది కాదని అంటే నమ్ముతారా.? అవును నిజమే, ప్రతీ రోజూ స్నానం చేయడం వల్ల మంచి కంటే చెడు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకులు రాబర్ట్ హెచ్‌.ష్మెర్లింగ్ ఇందుకు సంబంధించి పలు విషయాలను తెలిపారు. ఇంతకీ ఆయన ఇచ్చిన రిపోర్ట్‌ ఏముందంటే.. 

24
bathing in winter

అమెరికాలో సుమారు మూడింట రెండు వంతుల మంది రోజూ స్నానం చేస్తారు. అదే ఆస్ట్రేలియాలో అయితే ఈ సంఖ్య 80 శాతంగా ఉంటుంది. కానీ చైనాలలో మాత్రం సగం మంది వారానికి రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తారంటా. సహజంగా రోజూ స్నానం చేయడానికి గల కారణాల విషయానికొస్తే. శరీర దుర్వాసన, నిద్రమత్తు పోవడానికి, వ్యాయామం చేసిన తర్వాత శరీరం శుభ్రపడడం వంటివి కారణాలుగా చెబుతుంటారు. 

ఇది కూడా చదవండి: Chat GPT: మీ ఫోన్‌లో ఈ వాట్సాప్‌ నెంబర్ ఉంటే.. ప్రపంచం మీ చేతిలో ఉన్నట్లే..

34

రోజూ స్నానం చేయడం అవసరమా.? 

అయితే రోజూ స్నానం చేయడం అవసరం లేదని రాబర్ట్‌ అభిప్రాయపడుతున్నారు. చర్మంపై ఉండే సహజ నూనె, మంచి బ్యాక్టీరియా తరచూ స్నానం చేయడం వల్ల పోతుందని అంటున్నారు. మరీముఖ్యంగా వేడీ నీటితో స్నానం చేయడం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలా రోజూ స్నానం చేయడం వల్ల చర్మం పొడిగా, చికాకుగా మారే అవకాశాలు ఉంటాయని. పొడిగా, పగిలిన చర్మం ద్వారా బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశించి.. ఇన్ఫెక్షన్లకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు సాధారణ బ్యాక్టీరియాను కూడా నాశనం చేసి, చర్మంపై హానికరమైన సూక్ష్మజీవుల పెరుగుదలకు దారి తీస్తాయి. తరచూ స్నానం చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. 

ఇది కూడా చదవండి: Motivation: ఇతరులతో పోల్చుకొని బాధపడుతున్నారా? ఈ కాకి కథ చదివితే మీ ఆలోచన మారాల్సిందే

 

44

చర్మాన్ని అధికంగా శుభ్రం చేయడం పెద్ద ఆరోగ్య సమస్య కాకపోయినా.. ఇది చర్మాన్ని పొడిగా చేయవచ్చు. రోజూ స్నానం చేయడం ఆరోగ్యాన్ని మెరుగుపరచదు, పైగా చర్మ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. నిపుణుల సూచన ప్రకారం వారానికి 4 సార్లు స్నానం చేస్తే సరిపోతుందని అంటున్నారు. అదికూడా శరీరంలో చెమట ఎక్కువగా పేరుకుపోయే కొన్ని ప్రాంతాలను శుభ్రం చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. హార్వర్డ్‌ మెడికల్ స్కూల్‌ పబ్లిషింగ్‌కు సంబంధించిన పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Read more Photos on
click me!

Recommended Stories