కేవలం 3 కిలో మీటర్ల దూరం కోసం అసలు ఎవరు రైలు ఎక్కుతారు అనుకోవచ్చు. కానీ, అక్కడ నివసించే వేలాది మంది ప్రతిరోజూ ఈ రైలు ఎక్కుతూనే ఉంటారు. నాగ్ పూర్ నగరంలో ఉద్యోగాలు, కాలేజీలు, ఇతర వ్యాపారాల కోసం వెళ్లేవారు ఈ రైలు ప్రయాణం చేస్తూనే ఉంటారు. రోడ్డు ప్రయాణం చాలా రద్దీగా ఉంటుందని, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని.. ఈ రైలు ప్రయాణాన్ని వారు ఎంచుకుంటారు. కేవలం 7 నిమిషాల్లో తమ డెస్టినేషన్ చేరుకుంటామని.. వీరు ఈ రైలు ఎక్కుతూ ఉంటారు.
ఈ రైలు ప్రయాణం టికెట్ ధర ఎంతంటే...
ఈ అత్యంత తక్కువ రైలు ప్రయాణం టికెట్ ధరలు వింటే మాత్రం షాక్ అయిపోతారు. ప్రయాణం చిన్నగా ఉన్నా.. టికెట్ ధర మాత్రం ఎక్కువగానే ఉంటుంది.
జనరల్ క్లాస్: ₹60
స్లీపర్ క్లాస్: ₹145 నుండి ₹175 వరకు
AC 3-టైర్: ₹555
AC 2-టైర్: ₹760
AC 1st క్లాస్: ₹1,255
అంటే... కేవలం 7 నిమిషాల ప్రయాణానికి రూ.1255 ఖర్చు పెట్టేవారు కూడా ఉన్నారు అని అర్థం. లాంగ్ జర్నీలకు మారుపేరుగా మన భారత రైల్వేలో.. ఈ అత్యంత షార్ట్ జర్నీ కూడా ఉండటం విశేషం.