1. పప్పును దోరగా వేయించండి:
వండే ముందు పప్పును నూనె లేకుండా పొడిగా 2–3 నిమిషాలు వేయించడం వల్ల అందులోని తేమ తగ్గుతుంది. తర్వాత నీటిలో పప్పును నానపెట్టినప్పుడు అది తొందరగా మెత్తగా మారుతుంది. దీనివల్ల వంట సమయం తగ్గడమే కాకుండా, పప్పుకు మంచి గుమగుమలాడే కమ్మని రుచి వస్తుంది.
2. పొట్టు తీసిన పప్పును ఎంచుకోండి:
పప్పు తొందరగా ఉడకాలి అనుకున్నప్పుడు.. పొట్టు ఉన్న పప్పు కాకుండా... పొట్టు లేని పప్పును ఎంచుకోవాలి. ఇలాంటి పప్పును ఎంచుకుంటే చాలా తొందరగా ఉడుకుతుంది.
3.సరిగా ఉడకకపోతే..
పప్పు ఎప్పుడైనా సరిగా ఉడకకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ పప్పును కాస్త ఆరనిచ్చి.. బ్లెండర్ లో తిప్పితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల.. పప్పు చాలా క్రీమీగా మారుతుంది. రుచి కూడా కమ్మగా ఉంటుంది.
4. ఉప్పును చివర్లోనే వేయండి:
చాలామంది వండేటప్పుడే ఉప్పు వేస్తారు. కానీ మొదట్లోనే ఉప్పు వేస్తే పప్పు పైపొర గట్టిపడి ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే పప్పు సగంపైగా ఉడికిన తర్వాతే ఉప్పు కలపాలి.
5. టమోటాలు, పులుపును ఆఖరులో మాత్రమే కలపండి:
టమోటాలు, చింతపండు, నిమ్మకాయ వంటి ఆమ్ల (Acidic) గుణం ఉన్న పదార్థాలు పప్పు మెత్తగా మారకపోగా, గట్టిగా మారుతుంది. కాబట్టి పప్పు బాగా ఉడికిన తర్వాత, తాలింపు వేసే సమయంలో మాత్రమే టమోటాలను కలపడం మంచిది.
6. చిటికెడు బేకింగ్ సోడా వేయండి:
ఇది పాతకాలపు సీక్రెట్ ట్రిక్! పప్పు ఉడికించేటప్పుడు చిటికెడు (సుమారు ⅛ టీస్పూన్) బేకింగ్ సోడా వేస్తే పప్పు చాలా వేగంగా ఉడుకుతుంది. ఎక్కువ వేస్తే రుచి మారుతుంది కాబట్టి చిటికెడు మాత్రమే వాడండి.