Station with Longest Name: ఒకే పదంతో దేశంలోనే అతి పొడవైన రైల్వే స్టేషన్... మన ఏపీలోనే ఉంది..!

Published : Nov 17, 2026, 05:14 PM IST

Longest name Railway station: మన దేశంలో చాలా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. కానీ.. మనకు చదవడానికి కష్టంగా ఉండి, నోరు తిరగడానికి ఇబ్బందిగా ఉండే స్టేషన్ ఒకటి ఉంది. ఇది ఎక్కడ ఉందో తెలుసా?

PREV
13
రైల్వే స్టేషన్..

ఇండియన్ రైల్వేలో వేలాది స్టేషన్లు ఉన్నాయి. కానీ, కొన్ని స్టేషన్లు తమ వింత, అతి పొడవైన పేర్లతో ప్రయాణికులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి ఒక అరుదైన రికార్డు మన ఆంధ్రప్రదేశ్ కి దక్కింది. భారతదేశంలోనే ఒకే పదంతో అతి పొడవైన పేరున్న రైల్వే స్టేషన్ మన ఏపీలోనే ఉంది. ఆ స్టేషన్ పేరు ‘ వెంకటనరసింహరాజువారిపేట’. ఈ స్టేషన్ వెనక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం....

23
ఈ స్టేషన్ ఎక్కడ ఉంది?

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి (ఉమ్మడి చిత్తూరు) జిల్లా పరిధిలో, తమిళనాడు సరిహద్దుకు అత్యంత సమీపంలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. రేణిగుంట- అరక్కోణం రైల్వే మార్గంలో, నగరి సమీపంలో ఈ చిన్న స్టేషన్ కనిపిస్తుంది. ఈ స్టేషన్ పేరును మొత్తం పిలవలేక.. అక్కడ ఉన్న ప్రజలు ఈ స్టేషన్ కి స్పెషల్ గా పేరు పెట్టుకున్నారు. స్టేషన్ కోడ్ VKZ.

28 అక్షరాల సుదీర్ఘమైన పేరు...

ఇంగ్లీష్ అక్షరాల ప్రకారం.. Venkatanarasimharajuvaripeta అనే పేరులో ఏకంగా 28 అక్షరాలు ఉంటాయి. ఒకవేళ దీని ముందు గౌరవసూచకంగా శ్రీ అని చేర్చితే 31 అక్షరాలు అవుతాయి. మధ్యలో ఎలాంటి స్పేస్ లేకుండా, ఒకే పదంగా రాసే అతి పొడవైన రైల్వే స్టేషన్ పేరు ఇదే కావడం విశేషం. కొత్తగా ఈ రూట్ లో ప్రయాణించే వారికి బోర్డు మీద ఉన్న ఈ పేరును ఒక్కసారిగా చదవడం కాస్త కష్టమే.

33
ఈ స్టేషన్ కి ఆ పేరు ఎలా వచ్చింది..?

పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన స్థానిక జమీందార్ రాజు శ్రీ వెంకట నరసింహ రాజు గారి పేరు మీదుగా ఈ గ్రామానికి, రైల్వే స్టేషన్ కు ఈ పేరు వచ్చింది. కాలక్రమేణా ఆ పేరు అలాగే స్థిరపడిపోయి, భారతీయ రైల్వే రికార్డుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

చిన్న స్టేషన్.. కానీ పెద్ద రికార్డు...

ఇది చాలా చిన్న ప్యాసింజర్ హాల్ట్ స్టేషన్. ఇక్కడ కేవలం లోకల్ ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. స్టేషన్ ప్లాట్ ఫారమ్ చిన్నదిగా ఉన్నా, దీని పేరు మాత్రం దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్. రైల్వే టికెట్ల మీద, రిజర్వేషన్ చార్టుల మీద ఇంత పెద్ద పేరును పూర్తిగా ముద్రించడం కష్టం కాబట్టి, రైల్వే శాఖ ఎక్కువగా దీని షార్ట్ కోడ్ VKZ ఉపయోగిస్తున్నారు.

అతి చిన్న పేరుతో పోలిస్తే.. మన దేశంలో ఒడిశాలోని 'ఇబ్' (Ib) అనే రైల్వే స్టేషన్ కేవలం రెండే రెండు అక్షరాలతో అతి చిన్న పేరున్న స్టేషన్‌గా రికార్డు సృష్టిస్తే, 28 అక్షరాలతో మన ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటనరసింహరాజువారిపేట ఒకే పదంతో అతి పొడవైన పేరున్న స్టేషన్‌గా నిలిచి మన రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

Read more Photos on
click me!

Recommended Stories