స్పెషల్ డేస్ మీకు అందమైన హెయిర్ స్టైల్స్ కావాలా.. అయితే ఇలా ప్రయత్నించండి.. అందరిలోకి మీరే అందంగా

First Published Oct 21, 2021, 4:28 PM IST

ఈ తరం అమ్మాయిలు అందంగా, భిన్నంగా కనిపించాలని భావిస్తారు. అందుకు చక్కటి మేకప్ (Makeup), చక్కటి వస్త్రధారణలో (Dress) కనపడతారు. వీటితో పాటు అందమైన హెయిర్ స్టైల్ కూడా అవసరమే.

ఈ తరం అమ్మాయిలు అందంగా, భిన్నంగా కనిపించాలని భావిస్తారు. అందుకు చక్కటి మేకప్ (Makeup), చక్కటి వస్త్రధారణలో (Dress) కనపడతారు. వీటితో పాటు అందమైన హెయిర్ స్టైల్ కూడా అవసరమే. అయితే అందంగా కనిపించాలంటే ముఖానికి తగిన మేకప్ తో పాటు దానికి తగినట్లుగా హెయిర్ స్టైల్ కూడా ముఖ్యం.
 

మనం నిత్యం ఎన్నో రకాల వేడుకలలో పాల్గొంటాం. ఒక్కో వేడుకకు ఒక్కో హెయిర్ స్టైల్ (Hairstyle) లో కనిపిస్తే అందరి చూపు మన వైపే ఉంటుంది. పండుగ వేడుకలకు, పార్టీలకు, క్యాజువల్ అవుటింగ్స్, కాలేజీకి వెళ్లేవాళ్లకు, ఆఫీస్ కి రకరకాల హెయిర్ స్టైల్ ను సులభంగా వేసుకోవచ్చు. కాబట్టి ట్రెండ్ (Trend) గా కనబడేందుకు ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలో తెలుసుకుందాం. 
 

బ్రెయిడెడ్ బన్ (Braided bun): జుట్టుకు మధ్య భాగంలో పాపిడి తీసి  మొత్తం హెయిర్ (Hair) ని వెనక్కి తీసుకొని రబ్బర్ బ్యాండ్ బిగుతుగా (Tight) వేయాలి. రబ్బర్ వేసిన మొత్తం జుట్టును రబ్బర్ బ్యాండ్ చుట్టూ తిప్పి కొప్పు కట్టాలి. ఈ కొప్పును పూలతో కాని అందమైన స్టోన్స్ ఉన్న బిళ్లలతో అలంకరించిన చూడడానికి చాలా అందంగా ఉంటుంది.
 

బ్రెయిడెడ్ హాలో (Braided halo): అమ్మాయిలు చక్కగా క్యూట్ గా కనపడడానికి ఈ హెయిర్ స్టైల్ ఉపయోగపడుతుంది. దీని కోసం జుట్టును మ‌ధ్య‌లోకి పాపిట (Sinful) తీసి వ‌దిలేసి ఒక్కోవైపు నుంచి ఒక్కో జ‌డ‌ను పూరి తిప్పుతూ వెన‌క్కి తీసుకురావాలి. ఇలా వెన‌క్కి వ‌చ్చిన త‌ర్వాత అక్క‌డ పిన్స్ (Pins) పెట్టి వ‌దిలేయాలి. ఇది ఎలాంటివారికైనా అందంగా కనిపిస్తుంది.
 

లూజ్ ఫ్లోరల్ బ్రెయిడ్ (Loose floral braid): సాధారణంగా అందరూ జడలను బిగుతుగా అల్లుతూ (Floating) ఉంటారు. ఈ జడకు కొత్త లుక్ ఇవ్వడం కోసం జుట్టును వదులుగా అల్లి పూలతో కానీ అందమైన బిళ్లలతో అలంకరిస్తే జడ అందంగా కనిపిస్తుంది. ఇలా ఏదైనా వేడుకలలో (Celebrations) వేసుకుంటే బాగుంటుంది.
 

సైడ్ పోనీ (Side pony): పార్టీల కోసం, బయటకు వెళ్లేటప్పుడు పెద్దగా సమయం లేకపోయినప్పుడు ఈ స్టైల్ (Style)ని వేసుకోవచ్చు. ఈ హెయిర్ స్టైల్ సింపుల్ (Simple)గా ఉంటుంది సౌకర్యవంతంగా ఉంటుంది. మొత్తం చుట్టిన పక్కకు దువ్వుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఈ హెయిర్ స్టైల్ మీకు కొత్త లుక్ ను తెస్తుంది.

click me!