ఇలాంటి ఫుడ్ ను చూడగానే ఆగలేకపోతున్నారా? ఇదిగో ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. వాటిని తినాలన్న కోరిక కూడా రాదు..

Published : Oct 30, 2022, 09:44 AM IST

పక్కాగా బరువు తగ్గాలంటే.. బరువును పెంచే ఆహారాలను అసలే తినకూడదు. కానీ చాలా మందికి ఇలాంటి ఆహారాలను చూడగానే వెంటనే తినేయాలనిపిస్తుంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే.. వాటిని చూసినా.. తినాలనిపించదు. అవేంటంటే.. 

PREV
17
ఇలాంటి ఫుడ్ ను చూడగానే ఆగలేకపోతున్నారా? ఇదిగో ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. వాటిని తినాలన్న కోరిక కూడా రాదు..

బరువు తగ్గడం అంత సులువైన విషయం కాదు. దీనికోసం ఇష్టమైన ఆహారాలను వదులుకోవాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేవలం బరువును తగ్గించే ఆహారాలనే తినాల్సి ఉంటుంది. అది కూడా లిమిట్ లోనే. కానీ బరువు తగ్గాలనుకునే చాలా మందికి ఇష్టమైన అంటే ఆరోగ్యాన్ని పాడు చేసే, బరువును పెంచే ఆహారాలను చూస్తే అస్సలు ఆగలేకపోతుంటారు. ఎప్పుడెప్పుడు వాటిని తిందామా అనుకుంటారు. ఆకలిగా ఉన్నప్పుడు ఇలా అనిపించడం కామన్ యే కానీ.. ఆకలి కోరికలకు లొంగి పోయి తింటే మాత్రం మీరు బరువు అస్సలు తగ్గనుగాక తగ్గరు. ముఖ్యంగా విపరీతంగా బరువు పెరిగిపోతారు. మరి ఇలాంటి ఆకలి కోరికలను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం పదండి. 
 

27
protein rich foods

ప్రోటీన్ ఫుడ్

ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల.. అనారోగ్యకరమైన ఆహారాలను తినాలన్న కోరికలు తగ్గుతాయని, అర్థరాత్రి తినే అలవాటు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే మీ ఆకలి హార్మోన్ ను తగ్గిస్తుందని ఎన్నో అధ్యయనాలు కూడా వెల్లడించాయి. అంతేకాదు ఈ ప్రోటీన్ ఫుడ్ పెప్టైడ్ అని పిలిచే హార్మోన్ స్థాయిని కూడా పెంచుతుంది. ఇది మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. 
 

37
protein

ఇది బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది? 

ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. బరువు సంబంధిత హార్మోన్లను నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన బరువుకు సహాయపడుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల డోపమైన్ స్థాయిలు బాగా పెరుగుతాయి. దీనివల్ల మధ్యాహ్నం భోజనంలో చాలా తక్కువ అన్నం తింటారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

47
protein

ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ అంటే? 

ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు, చికెన్, చేపలు, గంజి వంటివి కొన్ని ఉంటాయి. వీటిలో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గోధుమ తవుడు గంజిని తాగడం వల్ల దాని నుంచి 22 గ్రాముల పిండి పదార్థాలు, 5 గ్రాముల ఫైబర్ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. 

57

మీరు రోజూ తినాల్సిన ప్రోటీన్ రిచ్ ఫుడ్స్

మయో క్లినిక్ ప్రకారం.. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు గిజంలు, సోయా, విత్తనాలు, బీన్స్, కాయధాన్యాలు వంటి మొక్కల వనరుల్లో ఎక్కువగా ఉంటాయి. స్కిన్ లేని తెల్లని చికెన్ లేదా టర్కీ వంటి మాంసాల్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చేపలు, గుడ్డులోని తెల్లసొన,  

67

అయినా అధిక ప్రోటీన్ ఆరోగ్యానికి మంచిది కాదు.. 

ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వీటిని మరీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే కొన్ని రకాల ప్రోటీన్ ఫుడ్ లు పిండి పదార్థాలను పరిమితం చేస్తాయని మాయో క్లినిక్ చెబుతోంది.అంటే ఈ ఫుడ్ వల్ల మన శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు లేదా ఫైబర్ అందకపోవచ్చు. దీనివల్ల నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రావడం, మలబద్దకం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. 

77

వీటికి తోడు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన మాంసాలు, సంతృప్త కొవ్వు అధికంగా ఉన్న ఇతర ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ప్రయోజనాలున్నాయి కదా అని ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తినకూడదు. 
 
 

Read more Photos on
click me!

Recommended Stories