కొత్తిమీర అంటే ఇష్టం లేదా? కానీ దీన్ని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే.. అస్సలు వదలరు..

Published : Oct 29, 2022, 04:21 PM ISTUpdated : Oct 29, 2022, 04:30 PM IST

కొత్తిమీరలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, ఐరన్, విటమిన్ కె, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అందుకే దీన్ని పక్కన పెట్టకండి.

PREV
17
కొత్తిమీర అంటే ఇష్టం లేదా? కానీ దీన్ని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే.. అస్సలు వదలరు..

కొత్తిమీర ఆకులు విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్ కె , ఫాస్పరస్ వంటి పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ ఆకుల్లో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు కొత్తిమీర ఆకులలో కెరోటినాయిడ్లు, ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్లు వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు కూడా ఉన్నాయి.
 

27

కొత్తిమీర ఆకుల్లో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. కన్నులో ఎరుపుదనం, మాక్యులర్ వల్ల కలిగే దృష్టి రుగ్మతలను సరిచేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. 
 

37

కొత్తిమీర ఆకుల్లోని పీచుపదార్థాలు, ప్రోటీన్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. కొత్తిమీర ఆకుల్లో ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కామెర్లు,  పిత్తం వంటి కాలేయ వ్యాధులను నయం చేయడానికి సహాయపడతాయి. 
 

47


కొత్తిమీర ఆకుల్లో విటమిన్ సితో పాటుగా విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ తో పాటు ఈ రెండు పోషకాలు కూడా రోగ నిరోధక శక్తిని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. దీనిలో ఉండే విటమిన్ సి తెల్ల రక్త కణాలు సమర్థవంతంగా పనిచేయడానికి, ఇనుమును శోషించుకోవడానికి సహాయపడుతుంది.
 

57

కొత్తిమీర ఆకుల్లో ఉండే ఆంథోసైనిన్లు మంటను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది అజీర్థి, కడుపు పూతల సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. కొత్తిమీర ఆకులను తింటే గ్యాస్ట్రిక్ మ్యూకోస స్రావాల స్థాయి పెరుగుతుంది.  ఇది బలమైన ఆమ్లాల నుంచి కడుపు గోడలను రక్షిస్తుంది. దీంతో గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

67

కొత్తిమీర ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి పోషకాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొత్తిమీర ఆకుల్లో  కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి సయాటికాతో సంబంధం ఉన్న నొప్పి నుంచి ఎముకలను రక్షిస్తాయి.

77

కొత్తిమీరలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో అసౌకర్యం, విరేచనాలు, గ్యాస్, ప్రేగు కదలికలు, వికారం వంటి వివిధ జీర్ణ సమస్యల నుంచి బయటపడేస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories