కొన్ని రకాల కూరగాయలు షుగర్ పేషెంట్లకు చాలా మంచివి. వీటిని రోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్ లు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి.
మాంసం కంటే కూరగాయలే మన ఆరోగ్యానికి మంచివి. ఎందుకంటే వీటిలో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియంతో పాటుగా ఇతర ముఖ్యమైన ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్లే మన శరీరానికి బలం వస్తుంది. రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. కూరగాయల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. చాలా రకాల కూరగాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇలాంటి వాటిని మధుమేహులు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు ఎప్పుడూ చెప్తుంటారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను ఎలాంటి కూరగాయలు తగ్గిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
26
raw papaya
బొప్పాయి
ఆరోగ్యకరమైన కూరగాయలలో బొప్పాయి ఒకటి. దీనిలో చరాంథిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు దీనిలో పాలీపెప్టైడ్-పి అని పిలువబడే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం కూడా ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్లు దీన్ని తప్పకుండా తినాలి.
36
బ్రోకలీ
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఉత్తమ కూరగాయల్లో బ్రోకలీ ఒకటి. బ్రోకలీలో విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో విటమిన్ సి తో పాటుగా పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
46
ముల్లంగి
రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో ముల్లంగి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముల్లంగిలో విటమిన్ సి, బీటా కెరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నతను నెమ్మదింపజేస్తుంది. అవి రక్తప్రవాహంలోకి శోషించుకోబడతాయి. అందుకే ఈ కూర ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ రోగులకు చాలా మంచిది.
56
బచ్చలికూర
బచ్చలికూర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిలో ఫోలేట్, డైటరీ ఫైబర్ , విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచిది. ఇది చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
66
గ్రీన్ బీన్స్
రెగ్యులర్ గా బీన్స్ ను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఛాన్స్ యే ఉండదు. ఎందుకంటే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుందని ఎన్నో అధ్యయనాలు కూడా నిరూపించాయి.