అరచేతులు లేదా అరికాళ్లకు చెమటలు పట్టకూడదంటే ఏం చేయాలి?

First Published Jun 12, 2024, 10:22 AM IST

ఎండాకాలంలో చెమటలు పట్టడం సర్వసాధారణం. కానీ కొంతమందికి అరచేతులు లేదా పాదాల అరికాళ్లలో విపరీతంగా చెమటలు పడుతుంటాయి. దీనివల్ల చికాకు మాత్రమే కాదు క్రిములు, బ్యాక్టీరియా సమస్య కూడా పెరుగుతుంది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

వేసవిలో అండర్ ఆర్మ్స్  లోనే కాకుండా చాలా మందికి చేతులు, కాళ్లపై కూడా చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. దీనివల్ల చేతులతో ఏదైన పట్టుకోవడానికి  ఇబ్బంది కలుగుతుంది. ఇక అరికాళ్ల చెమటల వల్ల చెప్పులు కూడా జారిపోతుంటాయి. ఇది చిరాకు తెప్పిస్తుంది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Image: FreePik


గంధం పొడి

గంధపు చెక్కను శతాబ్దాలుగా చర్మానికి ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇది చర్మాన్ని చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే దురద మొదలైన వాటి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. దీని సహాయంతో మీరు చేతులు, కాళ్ల చెమట నుంచి బయటపడొచ్చు. ఇందుకోసం గంధం పొడిలో రోజ్ వాటర్, కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ లాగ తయారు చేయండి. దీన్ని చెమట పట్టే ప్రదేశంలో అప్లై చేయండి. ఈ పేస్ట్ చిక్కగా ఉండాలి. అలాగే ఇది పూర్తిగా ఆరిన తర్వాతనే చేతులను, కాళ్లను కడక్కోవాలి. దీనివాడకం వల్ల చెమట చాలా వరకు తగ్గుతుంది.

కూల్ వాటర్  

చేతులు, కాళ్ళపై ఎక్కువ చెమట పడుతుంటే మీరు రోజుకు కనీసం 2-3 సార్లైన ఐస్ వాటర్ లో మీ చేతులను, కాళ్లను కాసేపు నానబెట్టండి. ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు చేయాలి. కావాలనుకుంటే ఈ నీటిలో కొద్దిగా రోజ్ వాటర్, ముల్తానీ మట్టిని కూడా కలుపుకోవచ్చు. ఇవన్నీ చెమట వాసనను తొలగించడమే కాదు బ్యాక్టీరియా పెరగకుండా కూడా నిరోధిస్తాయి.
 

అలమ్ సహాయపడుతుంది

పాదాల అరికాళ్లపై చెమట ఎక్కువగా పడుతుంటే దాన్ని నియంత్రించడానికి కూడా ఆలం వాడకం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో యాంటీ సెప్టిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే బ్యాక్టీరియాను చంపడానికి కూడా ఇది పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించడానికి మీరు ముందుగా దాని పొడిని తయారు చేసి, తరువాత గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి అందులో పాదాలను 10-15 నిమిషాలు నానబెట్టండి.
 

ఉప్పు 

చెమట ఎక్కువగా పడితే అరచేతులు, అరికాళ్ల నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఈ వాసన రాకుండా చేయడంలో ఉప్పు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక టబ్ లో 6-7 టీస్పూన్ల ఉప్పు వేయండి. దీనిలో మీ కాళ్లు నానెటట్టు గోరువెచ్చని నీళ్లు పోసి ఉప్పు కలిసేటట్టు కలపండి. ఈ వాటర్ లో మీ చేతులు, కాళ్లను కనీసం 15-20 నిమిషాల పాటైనా నానబెట్టండి. ఇలా చేయడం వల్ల చెమట మునుపటి కంటే బాగా తగ్గిందని మీరే గమనిస్తారు. 

Latest Videos

click me!