వాదించకూడదు...
చాలా మంది మనల్ని రెచ్చగొట్టి వారు సంతోషించాలని అనుకుంటారు. వారు ఏదైనా మాట్లాడితే.. మీరు అది నిజం కాదు అని వారితో వాదించాల్సిన అవసరం లేదు. వాళ్లు చెప్పిందానికి అంగీకరించండి.. మీకు పోయేది ఏమీ లేదు.
అతి వినయం...
కొన్నిసార్లు చాలా మంది మన ప్రశాంతతను బలహీనంగా పొరపడతారు. అందుకే అతి వినయంగా ఉండకూడదు. ఎవరైనా మిమ్మల్ని కించపరిస్తే...‘ మీరు మా కళ్లు తెరిపించారు.. మీలాంటి మార్గదర్శిని పొందడం నా అదృష్టం’ అని తెలివిగా చెప్పి తప్పించుకోండి.
గెలిచి చూపించండి...
మీరు చేయాలి అనుకున్న పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకూడదు. నిశ్శబ్దంగా కష్టపడాలి. మీరు సక్సెస్ అయ్యే వరకు ఆ విషయాన్ని బయట పెట్టకూడదు. మీరు విజయం సాధించిన తర్వాత ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయమే మీ గురించి అందరికీ అర్థమయ్యేలా చెబుతుంది.
దూరంగా ఉండాలి...
అతి చనువు అగౌరవానికి దారితీస్తుంది. మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే, ప్రజలు మీకు విలువ ఇవ్వడం మర్చిపోతారు. కాబట్టి ప్రతి పిలుపుకు సమాధానం ఇవ్వకండి, లేదా ప్రతి ఆహ్వానానికి స్పందించకండి. అప్పుడు మీ విలువ పెరుగుతుంది.