Kitchen Hack: గిన్నెలు తోమే స్పాంజ్‌ను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలో తెలుసా?

Published : May 13, 2026, 05:28 PM IST

Kitchen Hack: వంటగదిలో గిన్నెలు కడిగే స్పాంజ్ క్లీన్ చేయడానికే అనుకుంటే పొరపాటే. తడిగా ఉండే స్పాంజ్ పైకి బ్యాక్టీరియా చేరుతుంది. టాయిలెట్ సీటు కంటే దీనిపైనే ఎక్కువ క్రిములు ఉంటాయి. స్పాంజ్ నుంచి వాసన వస్తున్నా, జిడ్డుగా మారినా మార్చేయాలి. 

PREV
15
వాసన వస్తే వెంటనే మార్చేయాలి

మీ కిచెన్ స్పాంజ్ నుంచి కొంచెం దుర్వాసన వస్తున్నా, దానిపై లక్షలాది బ్యాక్టీరియాలు వచ్చి చేరతాయి. అటువంటి స్పాంజ్‌తో గిన్నెలు కడిగితే, ఆ క్రిములు నేరుగా మీ ఆహారంలోకి చేరి ఫుడ్ పాయిజనింగ్, డయేరియా వంటి రోగాలకు దారితీస్తాయి. జిడ్డు పట్టిన లేదా వాసన వచ్చే స్పాంజ్‌తో గిన్నెలు క్లీన్ చేయకూడదు. వెంటనే చెత్తబుట్టలో పడేయడమే మంచిది.

25
పాడైపోతే మార్చాల్సిందే

స్పాంజ్ చిరిగిపోయినా, దానిపై మరకలు కనిపించినా అది పనికిరాదు. ఇలా డ్యామేజ్ అయిన స్పాంజ్ పొరల్లో ఫుడ్ ఇరుక్కుపోయి, బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. చిరిగిన స్పాంజ్‌తో గిన్నెలు కడిగితే అవి సరిగ్గా శుభ్రపడకపోగా, బ్యాక్టీరియా అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి, స్పాంజ్ పాడైందని తెలిసిన వెంటనే దాన్ని మార్చేసి కొత్తదాన్ని వాడటం మీ కుటుంబ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

35
వేడి నీటితో శుభ్రం చేయాలి

స్పాంజ్‌ను అప్పుడప్పుడు స్పాంజ్‌ను మరుగుతున్న వేడి నీటిలో ముంచి శుభ్రం చేయాలి. ఇలా చేసిన తర్వాత, ఒక ఐదు నిమిషాల పాటు ఆ వేడి నీటిలోనే నానబెడితే అందులోని బ్యాక్టీరియా నశిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ స్పాంజ్ శుభ్రంగా ఉంటుంది.

45
వేర్వేరు స్పాంజ్ లు వాడాలి

గిన్నెలకు, కిచెన్ క్లీనింగ్‌కు వేర్వేరు స్పాంజ్‌లు వాడాలి. అన్నింటికీ ఒకటే వాడితే క్రిములు ఒకచోటు నుండి మరోచోటికి వ్యాపించి అనారోగ్యం కలిగిస్తాయి. వేర్వేరుగా వాడటం వల్ల క్రిములు ఆహార పాత్రలకు చేరకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన వంటగది కోసం ఈ చిన్న మార్పు తప్పనిసరి!

55
రెండు వారాలకోసారి మార్చాలి
సాధారణంగా ప్రతి రెండు వారాలకు ఒకసారి కిచెన్ స్పాంజ్‌ను మార్చాలి. మీ వాడకం ఎక్కువగా ఉంటే, అంతకంటే ముందే కొత్తది వాడటం మంచిది.
Read more Photos on
click me!

Recommended Stories