ఏసీ గదిలో నీళ్ల బకెట్ ఉంచడం చాలా మంచిది. ఇలా నీళ్ల బకెట్ ఉంచడం వల్ల ఆ నీరు నెమ్మదిగా గాలిలోకి ఆవిరి అయిపోయి..గదిలో తగినంత తేమ ఉండేలా చేస్తుంది. ఇది మంచి హ్యూమిడిఫైయ్యర్ లా పని చేస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారదు. మంచిగా తేమగా ఉంటుంది. శ్వాస సమస్యలు రావు. గొంతు పొడిబారే సమస్య ఉండదు. రాత్రిపూట మంచి నిద్రకూడా పడుతుంది.
AC నుండి వచ్చే గాలి చల్లగా ఉన్నప్పటికీ, అది పొడిగా ఉంటుంది. ఇది మీ శరీరంపైనే కాకుండా, ఇంటి వాతావరణంపై.. ఇంట్లోని వస్తువులపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పొడి గాలికి ఎక్కువసేపు గురికావడం వల్ల చెక్క ఫర్నిచర్‌లో పగుళ్లు ఏర్పడతాయి. ఇంట్లో పెంచుకునే మొక్కలు ఎండిపోతాయి. ఇంట్లో ఒక బకెట్ నీటిని ఉంచడం వల్ల గదిలో కొద్దిపాటి తేమ ఉంటుంది, ఇది ఈ సమస్యలను గణనీయంగా తగ్గిస్తుంది.
దీనిని ఎలా ఉపయోగించాలి?
బకెట్‌ను గది మూలలో లేదా కిటికీ దగ్గర ఉంచండి. బకెట్‌లోని నీటిని ప్రతిరోజూ మార్చాలి. లేకపోతే, నీటిలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది. మీరు కావాలనుకుంటే, నీటిలో నిమ్మ తొక్క లేదా కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్‌ను జోడించవచ్చు, ఇది సువాసనను ఇస్తుంది.