ఈ బెల్లం తో ఆరోగ్య ప్రయోజనాలు...
సాధారణ బెల్లంతో పోలిస్తే.. ఈ బెల్లం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చెరకు బెల్లం, పంచదారతో పోలిస్తే.. కరుపట్టి బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇది డయాబెటిస్ ఉన్నవారికి లేదా బరువు తగ్గాలి అనుకునేవారికి మంచి హెల్దీ ఆప్షన్. ఈ బెల్లంలో మన శరీరానికి అవసరం అయ్యే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గించి, శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది.
చలికాలంలో లేదా దగ్గు, జలుబు చేసినప్పుడు కరుపట్టి బెల్లాన్ని సుగంధ ద్రవ్యాలతో కలిపి తీసుకుంటే గొంతుకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. భోజనం తర్వాత చిన్న ముక్క కరుపట్టి బెల్లం నమలడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది, ఎసిడిటీ సమస్యలు దరిచేరవు.
వంటకాల్లో దీని ప్రత్యేకత: కెమికల్స్ కలవని ఈ సహజసిద్ధమైన కరుపట్టిని టీ, కాఫీ, కొన్ని రకాల స్వీట్లు, సాంప్రదాయ పిండి వంటల్లో వాడతారు. ఇది వంటకాలకు అద్భుతమైన సువాసనను, ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. చెరకు రసంతో కాకుండా, ప్రకృతి ఇచ్చిన తాటి వృక్షాల అమృతంలా తయారయ్యే ఈ కరుపట్టిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.