బంగాళాదుంపలు మన భారతీయ వంటల్లో ప్రధానమైనది. ప్రతి రెస్టారెంట్లో ఈ కూర ఉండాల్సిందే. ఇక పెళ్లి భోజనాల బంగాళాదుంప కూర లేనిదే భోజనం పూర్తి కాదు. ఈ దుంపలతో కూరలు, కర్రీలు, స్నాక్స్, చాట్ ఇలా ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు. సాధారణంగా బంగాళాదుంపలను ఉడికించాలంటే నీరు తప్పనిసరిగా అవసరం. కానీ ఇప్పుడు ఒక కొత్త కిచెన్ హ్యాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రెషర్ కుక్కర్లో నీరు లేకుండానే బంగాళాదుంపలు ఉడికించవచ్చని ఆ వీడియో చెబుతోంది. నీటిలో వేసి ఉడికిస్తే బంగాళాదుంపల్లోని పోషకాలు నీటిలో కలిసిపోతాయని అంటారు. దీని వల్ల రుచి కొద్దిగా తగ్గుతుందని అంటారు. అందుకే నీరు లేకుండా, బంగాళాదుంపల్లో సహజంగా ఉండే తేమతోనే ఉడికిస్తే రుచి మరింత బాగుంటుందనే నమ్మకం ఎక్కువ మందిలో ఉంది.