Gold: బంగారం ధర భారీగా పెరిగిపోయింది.ఇక.. బంగారం కొనడం అనేది కలగానే మిగిలిపోతుంది అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అయితే.. తక్కువ ధరలో కూడా జ్యూవెలరీ కొనుక్కోవచ్చు.
బంగారం ధర ఆకాశాన్ని తాకుతోంది.గత మూడేళ్లలో మరీ దారుణంగా పెరిగిపోయింది. బంగారం ధర తగ్గితే కొందాంలే అని ఎదురు చూసి.. చూసీ..అలసిపోయారు.ఈ లోగా తగ్గుతుంది అనుకున్న బంగారం కాస్త.. మరింత పెరిగిపోయింది. పది గ్రాముల బంగారం లక్షన్నర దాటేసింది. తులం లేకుండా.. చిన్న చైన్ కూడా రాదు. ఇక నక్లెస్, హారాలు కొనాలంటే అయ్యే పనే కాదు. మీరు కూడా ఇలానే ఫీలౌతున్నారా? అయితే.. బంగారం ధర పెరుగుతుందనే భయం లేకుండా తక్కువ ధరకే మీరు మీకు నచ్చిన జ్యూవెలరీ కొనుక్కోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..
24
18 క్యారెట్, 14 క్యారెట్ బంగారం..
బంగారాన్ని క్యారెట్లలో కొలుస్తారనే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు అందరూ 22 క్యారెట్ గోల్డ్ తో జ్యూవెలరీ చేయించుకుంటారు. కానీ, ఇప్పుడు ఉన్న ధరకు బంగారం కొనలేం కాబట్టి.. 18 క్యారెట్, 14 క్యారెట్ కొనుగోలు చేయడం మంచిది. 22 క్యారెట్ తో పోలిస్తే.. ఇవి మనకు తక్కువ ధరకే వస్తాయి. గట్టిగా కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో వీటిలో మోడల్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. మనకు నచ్చిన జ్యూవెలరీ చేయించుకోవచ్చు. అంతేకాదు.. వీటికి రీ సేల్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో బంగారం ధర ఇంకా ఎక్కువ పెరిగితే, మీ జ్యూవెలరీ విలువ కూడా పెరుగుతుంది.
34
సిల్వర్ జ్యూవెలరీ..
బంగారం కొనలేని వారు ఇప్పుడు హాల్ మార్క్ సిల్వర్ జ్యూవెలరీ ఎంచుకోవచ్చు. వెండి ధర కూడా పెరిగిపోయింది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ, బంగారం అంత అయితే కాదు కదా.. కాబట్టి.. బంగారంతో పోలిస్తే.. తక్కువ ధరకే వస్తుంది. వెండి నగలకు 22 క్యారెట్ బంగారుపూత పూసి అమ్ముతారు. చూడటానికి అచ్చం బంగారు నగల్లానే ఉంటాయి. వీటిని కొనడం వల్ల కూడా ఎలాంటి నష్టం ఉండదు. లోపల ఉన్నది వెండి కాబట్టి.. దానికి రీసేల్ వాల్యూ ఉంటుంది.
3. లైట్ వెయిట్ / హాలో జ్యూవెలరీ (Hollow Jewelry)
ప్రస్తుతం జ్యూవెలరీ షాపుల్లో CNC టెక్నాలజీతో చేసిన నగలు వస్తున్నాయి. ఇవి చూడటానికి చాలా పెద్దవిగా, బరువుగా కనిపిస్తాయి (ఉదాహరణకు 5 తులాల హారంలా ఉంటుంది), కానీ లోపల గుల్లగా ఉండటం వల్ల కేవలం 1 లేదా 2 తులాల బరువులోనే వస్తాయి.తక్కువ పెట్టుబడితో గ్రాండ్ లుక్ వస్తుంది.
ఇది ప్రస్తుతం చాలా మంది పాలో అవుతున్న బెస్ట్ ఐడియా. మీరు నగలు చేయించుకుంటే మేకింగ్ ఛార్జీలు (తరుగు, మజూరీ) రూపంలో 15-20% డబ్బు పోతుంది.మీకు ఉన్న బడ్జెట్‌తో 24K గోల్డ్ కాయిన్స్ లేదా బిస్కెట్లు కొని దాచుకోండి (వీటికి తరుగు ఉండదు, లాభం ఎక్కువ). ఫంక్షన్లకు వెళ్లినప్పుడు హై-క్వాలిటీ 1-గ్రామ్ గోల్డ్ లేదా వెండి పూత నగలు ధరించండి. మీ పెట్టుబడి బంగారం బిస్కెట్ల రూపంలో భద్రంగా పెరుగుతూ ఉంటుంది, బయటకు వెళ్లినప్పుడు నగలు లేవనే లోటు ఉండదు.
5. డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ బాండ్స్ (SGB)
మీరు నగలు ఇప్పుడే ధరించాల్సిన అవసరం లేదు, కేవలం పెట్టుబడి మాత్రమే ముఖ్యం అనుకుంటే Sovereign Gold Bonds (SGB) ది బెస్ట్. దీనికి మేకింగ్ ఛార్జీలు ఉండవు, పైగా ప్రభుత్వం ఏటా 2.5% వడ్డీ కూడా ఇస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత అప్పటి బంగారం రేటు ఎంత ఉంటే అంత డబ్బు మీకు వస్తుంది. ఆ డబ్బుతో అప్పుడు మీకు నచ్చిన నగలు కొనుక్కోవచ్చు.