దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎంత సేపు బ్రష్ చేయాలి? కరెక్ట్ టైమ్ ఇదిగో

Published : May 21, 2025, 03:00 PM IST

రోజూ మనం బ్రష్ చేస్తాం. కరెక్ట్  గా ఎంత సేపు చేస్తామో గుర్తుందా? ఎంత సేపు బ్రష్ చేస్తే పళ్లు శుభ్రంగా ఉంటాయో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
ఫాస్ట్ ఫుడ్ వల్లే సమస్యలు

మన రోజు రకరకాల ఆహార పదార్థాలు తింటుంటాం. డ్రింక్స్ తాగుతుంటాం. దీని వల్ల నోటిలోకి బ్యాక్టీరియా, ఇతర వైరస్‌లు చేరతాయి. అయితే ఎప్పటికప్పుడు నోరు, పళ్లు శుభ్రం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. కాని సరిగా శుభ్రం చేసుకోకపోతే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటి ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల పిల్లలు, పెద్దలు అందరూ పళ్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందువల్లే నోటి శుభ్రత చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

25
రెండు సార్లు బ్రష్ చేయాలి

సాధారణంగా మనం తినే ఆహారంలో ఎక్కువగా చక్కెర పదార్థాలు ఉంటాయి. అందువల్ల నోటిలో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. ఇది కాలక్రమేణా దంత సమస్యలకు, చిగుళ్ల ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. నోటిలో ఉండే దుర్వాసన కూడా దీనివల్లే ఏర్పడుతుంది. నిపుణుల సూచనల ప్రకారం ఈ సమస్యల నివారణకు రోజు రెండుసార్లు బ్రష్ చేయడం అవసరం.

35
వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..

బ్రషింగ్ సమయంలో అన్ని భాగాలను సరిగ్గా క్లీన్ చేయాలి. దీనివల్ల దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

స్వీట్లు, చిగుళ్లకు హాని కలిగించే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినేవారు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. 

తిన్న వెంటనే నోటిలో నీళ్లు పోసుకొని పుక్కళించడం, వేలు పెట్టి పళ్లు శుభ్రం చేసుకోవడం తప్పనిసరిగా చేయాలి.

45
బ్రషింగ్ ఎంత సేపు చేయాలి

దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే రోజుకు కనీసం 2 నిమిషాల పాటు రెండు సార్లు బ్రష్ చేయాలి.

ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే, రాత్రి నిద్రించే ముందు బ్రష్ చేయాలి. 

నోటిలో ఉన్న బ్యాక్టీరియాను తొలగించేందుకు సరైన టూత్ బ్రష్, పేస్ట్‌ను ఉపయోగించాలి.

55
శరీరం మొత్తానికి ఆరోగ్యం

నోరు ఆరోగ్యం ఉంటే కేవలం దంతాలు మాత్రమే స్ట్రాంగ్ గా ఉంటాయని కాదు.  మొత్తం శరీర ఆరోగ్యంగా ఉండటానికి నోరు, పండ్లు శుభ్రంగా ఉండటం చాలా కీలకం. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ ఉదయం, సాయంత్రం కనీసం 2 నిమిషాల పాటు బ్రష్ చేయడం అలవాటుగా మార్చుకోవాలి. 

Read more Photos on
click me!

Recommended Stories