చాలా మంది టాయిలెట్ లోనే టూత్ బ్రష్ లను పెడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే టాయిలెట్ లో ఎన్నో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ లు ఉంటాయి. ఇవన్నీ బాత్ రూం అంతటా ఉంటాయి. ఇవి మీ టూత్ బ్రష్ కు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే తడిగా లేని, టాయిలెట్ కు దూరంగా పెట్టాలి. అలాగే టూత్ బ్రష్ పొడిగానే ఉండాలి.
టవల్స్ షేరింగ్
ఒకరు తుడుచుకున్న టవల్ ను వేరేవాళ్లు తుడుచుకోకూడదు. ఎందుకంటే టవల్స్ కి తేమ, బ్యాక్టీరియా అంటుకుంటాయి. దీనివల్ల టవల్స్ లో సూక్ష్మక్రిములు పెరుగుతాయి. మీరు గనుక ఇతరుల తువాలును వాడితే స్కిన్ పై దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పింపుల్స్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే మీ టవల్ ను మాత్రమే ఉపయోగించండి. దాన్ని పొడిగా, నీట్ గా ఉంచుకోండి.