పితృ పక్షాల ప్రాధాన్యత...
పితృ పక్షం సమయంలో మన పూర్వీకుల ఆత్మలు భూమి మీదకు వస్తాయని నమ్ముతారు. అందుకే ఈ కాలంలో శ్రాద్ధకర్మలు, తర్పణాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయని, పితృ దోషాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ఆదివారం అమావాస్య రోజున చేసే దానధర్మాలు, శ్రాద్ధాలకు రెట్టింపు ఫలితాలు వస్తాయని నమ్ముతారు.
సర్వపితృ అమావాస్య – అరుదైన సమయం
ఈసారి అమావాస్య రోజు సర్వపితృ అమావాస్య కూడా వస్తోంది. ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ రోజున శ్రద్ధతో పూజలు చేస్తే కుటుంబానికి శాంతి, సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం. అదనంగా ఈ అమావాస్య రోజున సూర్యగ్రహణం సంభవించబోతోందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దాని ప్రభావం మన దేశంలో కనిపించదు అని పండితులు చెబుతున్నారు.