ఇంట్లో ఈగలు, దోమలు ఎక్కువైతే మనకు చాలా చిరాకు కలుగుుతంది. వీటితో విసిగిపోవడమే కాదు.. ఒక్కోసారి ప్రాణాంతకమైన రోగాల బారిన కూడా పడుతుంటాం. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించి ఈగలు, దోమల్ని పారదోలే దారులున్నాయనే విషయం మీకు తెలుసా?
కాలం అనే తేడా లేకుండా దోమలు చిరాకు పెడుతూనే ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం, తేమ ఎక్కువగా ఉన్న సమయంలో దోమలు విజ్రుంబిస్తుంటాయి. దోమకాటుతో డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక జ్వరాలు వస్తుంటాయి.
25
దోమ కాటుతో సమస్య
చాలాసార్లు దోమ కాటుతో పుండ్లు కూడా అవుతాయి. దాని వల్ల చాలాసార్లు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం దోమలు తరిమికొట్టే చాలా వస్తువులు మార్కెట్లో ఉన్నాయి. వాటిలో చాలా వరకు కెమికల్స్ ఉంటాయి. దాని వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
35
ఇంటి చిట్కాలే నయం
అందుకే దోమల నుంచి తప్పించుకోవడానికి ఇంటి చిట్కాలే నయం. వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లో దోమలు తరిమికొట్టడానికి, ఇల్లు తుడిచే నీళ్లలో నిమ్మరసం, పటిక వేయండి. అప్పుడు దోమలు పారిపోతాయి. దీంతో ఇంట్లోని క్రిములు కూడా పోతాయి.
45
నీళ్లు వేడి చేయండి
ఇల్లు తుడిచే నీళ్లు తప్పకుండా కొద్దిగా వేడిగా ఉండాలి. ఇంకా ఇల్లు తుడవడానికి నూలు గుడ్డను వాడండి. అప్పుడే దోమలు మాయం అవుతాయి. ఈ పద్ధతిలో దోమలను తరిమికొట్టాలంటే రోజుకి రెండుసార్లు ఇల్లు తుడుచుకోవాలి. సాయంత్రం ఇల్లు తుడుచుకున్నాక కిటికీలు, తలుపులు మూసేస్తే దోమల బెడద ఉండదు.
55
స్ప్రేలా వాడండి
వేడి నీళ్లలో నిమ్మరసం, పటిక వేసి బాగా కలపండి. నీళ్లు చల్లారిన తర్వాత బాటిల్‌లో పోసి పెట్టుకోండి. అప్పుడప్పుడు ఇంట్లో స్ప్రే చేయండి. దాంతో దోమలు, ఈగల బెడద ఉండదు.