Bad Breath నోరు దుర్వాసనా? ఈ రోగాల లక్షణాలేమో..!

నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కొందరికి దుర్వాసన తగ్గదు. రోజుకి రెండు మూడు సార్లు పళ్ళు తోముతున్నా అదే పరిస్థితి. దీన్ని అలక్ష్యం చేయొద్దు. ఇది ఏదైనా పెద్ద రోగం లక్షణం కావచ్చు! నోటి దుర్వాసనని నిర్లక్ష్యం చేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారేమో! ఐతే ఇప్పుడే జాగ్రత్త పడండి. నోటి దుర్వాసనకి కారణాలు ఏంటో తెలుసుకోండి.

Causes of bad Breath symptoms and health conditions in telugu
జబ్బులకు సంకేతం

దంత సమస్యలు ఉంటే చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది, నోట్లో ఇన్ఫెక్షన్లు ఉంటే దుర్వాసన వస్తుంది. తిన్న తర్వాత నోరు కడుక్కోక పోతే దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసనను తేలిగ్గా తీసుకుంటే కొన్నిసార్లు ప్రమాదకరం. కడుపు, లివర్ సమస్యలు ఉన్నా నోటి దుర్వాసన వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

హాలిటోసిస్ వ్యాధి

నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉందా? మాట్లాడుతుంటే అవతలి వాళ్ళు దూరంగా జరుగుతున్నారా? నోటి దుర్వాసన ఉంటే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోండి. దంత సమస్యలు, బ్యాక్టీరియా వల్ల నోటి దుర్వాసన వస్తుంది. దీనినే హాలిటోసిస్ అంటారు. నీళ్లు తక్కువ తాగినా, కడుపులో సమస్యలు ఉన్నా దుర్వాసన వస్తుంది.


నోరు పొడిబారడం వల్ల నోటి దుర్వాసన వస్తుందా? ఆరోగ్య నిపుణుల ప్రకారం, నోరు పొడిబారడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఎక్కువసేపు తినకుండా ఉంటే శరీరం పొడిబారి, లాలాజలం ఉత్పత్తి తగ్గి దుర్వాసన వస్తుంది.

సైనస్ సమస్య ఉందా?

సైనస్ నొప్పి ఉన్నా నోటిలో దుర్వాసన వస్తుంది. సైనస్ వల్ల మియుకాస్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల నోటిలో దుర్వాసన వస్తుంది. శరీరంలో విటమిన్ D లోపం ఉంటే ముక్కు, నోటిలో దుర్వాసన వస్తుంది. విటమిన్ D దంతాలు, శరీరానికి కాల్షియంను అందిస్తుంది. ఇది తగ్గితే దుర్వాసన వస్తుంది. సరిగ్గా తినకపోవడం, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు ఉంటే దంతాలు, నోటి నుంచి దుర్వాసన వస్తుంది. టాన్సిల్స్ ఏ వయసు వారికైనా ఒక పెద్ద సమస్య. దీనివల్ల కూడా నోరు దుర్వాసనగా ఉంటుంది. విటమిన్ D మాత్రమే కాదు, విటమిన్ C లోపం ఉన్నా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే డాక్టర్‌ని కలవండి.

Latest Videos

vuukle one pixel image
click me!