Home Decor: ఇంట్లో ఉపయోగించకుండా పక్కన పెట్టేసిన పాత బట్టలు కొండలా పేరుకుపోతుంటాయి. అయితే వాటిని ఏం చేయాలో తెలియదు. కానీ కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తే వాటిని అద్భుతమైన హోమ్ డెకర్ వస్తువులుగా మార్చుకోవచ్చు. అలాంటి కొన్ని ఐడియాలు మీకోసం.
ఇప్పటికే వాడిపోయిన డెనిమ్ జీన్స్‌ను పారేయకుండా వాటితో మోడ్రన్ స్టైల్ కుషన్ కవర్లు తయారు చేసుకోవచ్చు. డెనిమ్ ఫ్యాబ్రిక్ బలంగా ఉండటంతో ఇవి ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. ముఖ్యంగా జీన్స్ జేబులను అలాగే ఉంచితే వాటిలో టీవీ రిమోట్‌లు, మొబైల్ ఫోన్లు లేదా చిన్న వస్తువులు పెట్టుకునే సౌకర్యం కూడా లభిస్తుంది. లివింగ్ రూమ్ సోఫాలకు ఇవి యూనిక్ లుక్‌ను తీసుకొస్తాయి.
25
పాత చీరలకు కొత్త అందం
ఇంట్లో అల్మారాలో పడి ఉన్న పట్టు, కాటన్ లేదా డిజైనర్ చీరలను అందమైన కుషన్ కవర్లుగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా చీర అంచులు, పల్లులో ఉండే డిజైన్లు కుషన్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంప్రదాయ లుక్‌తో పాటు క్లాసిక్ టచ్‌ను కూడా ఇవి అందిస్తాయి. పాత జ్ఞాపకాలను అలాగే భద్రపరుచుకుంటూ ఇంటి అలంకరణలో ఉపయోగించుకోవడానికి ఇది మంచి మార్గంగా చెప్పొచ్చు.
35
స్వెటర్లతో వింటర్ స్టైల్ డెకర్
చలికాలంలో వాడిన పాత స్వెటర్లను కూడా అందమైన కుషన్ కవర్లుగా ఉపయోగించుకోవచ్చు. అల్లిన ఫ్యాబ్రిక్ కారణంగా ఇవి చాలా మృదువుగా, హాయిగా అనిపిస్తాయి. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లు, రీడింగ్ కార్నర్స్ లేదా వుడ్ ఇంటీరియర్ ఉన్న ఇళ్లలో ఇవి మరింత అందంగా కనిపిస్తాయి. మందపాటి నిట్ డిజైన్లు ఉన్న స్వెటర్లు కుషన్‌లకు ప్రత్యేక స్టైలిష్ లుక్‌ను తీసుకొస్తాయి.
పాత బట్టల నుంచి మిగిలిపోయిన చిన్న చిన్న గుడ్డ ముక్కలను కలిపి రంగురంగుల ప్యాచ్‌వర్క్ కుషన్ కవర్లు తయారు చేయవచ్చు. వివిధ రంగులు, డిజైన్లు, ఫ్యాబ్రిక్‌లను కలిపి తయారు చేసే ఈ కవర్లు ఇంటికి ఆర్టిస్టిక్ లుక్‌ను ఇస్తాయి. చేతితో చేసిన డిజైన్‌లా కనిపించే ఈ స్టైల్ ప్రస్తుతం హోమ్ డెకర్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. తక్కువ ఖర్చుతో ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేయగల సామర్థ్యం వీటికి ఉంటుంది.
55
టీషర్టులతో క్యాజువల్ కుషన్ కవర్లు
గ్రాఫిక్ ప్రింట్లు లేదా కోటేషన్లు ఉన్న పాత టీషర్టులను కూడా ఆకర్షణీయమైన కుషన్ కవర్లుగా మార్చుకోవచ్చు. కాటన్ ఫ్యాబ్రిక్ కారణంగా ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. యూత్‌ఫుల్ స్టైల్ ఇష్టపడే వారికి ఇవి మంచి ఎంపిక. ముఖ్యంగా లాంజ్ ఏరియాలు, స్టూడెంట్ రూమ్స్ లేదా క్యాజువల్ ఇంటీరియర్‌లకు ఇవి బాగా సెట్ అవుతాయి. పాత టీషర్టులపై ఉన్న డిజైన్లు కుషన్‌లకు కొత్త ఫ్యాషన్ టచ్‌ను తీసుకొస్తాయి.