మరి, ఇంజెక్షన్లు ఏమీ లేకుండా బ్రాయిలర్ కోళ్లు అంత వేగంగా ఎలా పెరుగుతున్నాయి అనే అనుమానం మీకు రావచ్చు. ఆర్గానిక్ ఫీడ్స్ ప్రకారం, బ్రాయిలర్ కోళ్లు సాధారణ నాటు కోళ్లకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ జాతి కోళ్లు వేగంగా పెరిగి, సుమారు 45 రోజుల్లోనే పెరిగిపోతాయి.
అంతేకాకుండా, బ్రాయిలర్ కోళ్లు వేగంగా పెరగడానికి ప్రత్యేక పోషణ అందిస్తారు. గత కొన్ని దశాబ్దాలుగా.. పౌల్ట్రీ నిపుణులు ఆరోగ్యంగా ఉండే, వేగంగా పెరిగే కోళ్లను మాత్రమే పెంచుతున్నారు. దీనికి తోడు, పౌల్ట్రీ ఫారాలలో వాటి ఆహారంపై అధిక శ్రద్ధ పెడతారు. వాటికి ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారాన్ని అందిస్తారు. అందుకే, అవి త్వరగా బరువు పెరుగుతాయి.
అయితే.. కొన్ని కోళ్ల ఫారాల్లో కోళ్లకు రోగాలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్స్ ఇస్తారు. అవి కూడా ప్రమాదమే.. అవి ఇవ్వకుండా పెరిగిన బ్రాయిలర్ కోళ్లను అయితే.. మనం హ్యాపీగా తినొచ్చు. యాంటీ బయోటిక్స్ ఇచ్చినా కూడా.. మార్కెట్లో అమ్మకానికి పంపడానికి కొద్ది రోజుల ముందే.. వాటిని ఇవ్వడం ఆపేయాలి. అలాంటివి అయితే.. మనం తిన్నా కూడా ఎలాంటి సమస్యలు రావు.