Home Decor: మీ పాత చీరల‌తో ఇంటిని అందంగా మార్చేయండి.. ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలిసి ఉండ‌దు

Published : Apr 26, 2026, 10:20 AM IST

Home Decor: ఇళ్ల‌లో పాత చీర‌లు స‌ర్వ‌సాధార‌ణం. చీర‌లు పూర్తిగా పాడ‌వ్వ‌క‌పోయినా అవుటాఫ్ ఫ్యాష‌న్ పేరుతో ప‌క్క‌న ప‌డేస్తుంటారు. అయితే తెలివిగా ఆలోచిస్తే ఎందుకు ప‌నికిరాని ఈ పాత చీర‌ల‌తో మీ ఇంటి అందాన్ని పెంచుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
కర్టెన్స్‌గా మార్చండి

ఒక చీర పొడవు సుమారు 6 మీటర్లు ఉండటం వల్ల కర్టెన్స్‌గా మార్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. రెండు లేదా మూడు చీరలను కలిపి ఒక రూమ్‌కు సరిపోయే కర్టెన్స్ తయారు చేసుకోవచ్చు. సన్నని చీరలను షీర్ కర్టెన్స్‌గా వాడుకోవచ్చు. కర్టెన్స్ బలంగా ఉండేందుకు లోపల లైనింగ్ ఫాబ్రిక్ జోడిస్తే మంచిది. కాటన్ చీరలు బెడ్‌రూమ్ విండోలకు చాలా బాగుంటాయి.

25
టేబుల్ క్లాత్‌, రన్నర్‌గా వాడండి

పాత చీరను కట్ చేసి డైనింగ్ టేబుల్‌కు సరిపడేలా టేబుల్ క్లోత్‌గా మార్చవచ్చు. పట్టు చీరలు పండగ సందర్భాల్లో టేబుల్‌కు ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. పైగా ప్లాస్టిక్ కవర్ వేసుకుంటే అది ఎక్కువకాలం మిగులుతుంది. అలాగే చీర బోర్డర్‌తో టేబుల్ రన్నర్ లేదా కోస్టర్లు తయారు చేసి టేబుల్ డెకర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.

35
కుషన్ కవర్స్‌గా ఉపయోగించండి

చీరలలో ఉండే రంగులు, డిజైన్లు కుషన్ కవర్స్‌కు అద్భుతంగా సరిపోతాయి. పాత చీరలను కట్ చేసి కుషన్ కవర్లు కుట్టి, వాటికి టాసెల్స్ లేదా లేస్ జోడిస్తే ఇంకా అందంగా కనిపిస్తాయి. పట్టు లేదా కాటన్ చీరలతో ఫ్లోర్ కుషన్స్ కూడా తయారు చేసుకోవచ్చు. పండగల సమయంలో సోఫా కవర్లుగా కూడా వాడుకోవచ్చు.

45
బెడ్‌స్ప్రెడ్స్‌గా మార్చండి

పట్టు, వెల్వెట్ చీరలను కలిపి బెడ్‌స్ప్రెడ్స్‌గా మార్చితే బెడ్‌రూమ్ లుక్ పూర్తిగా మారిపోతుంది. కాటన్ చీరలు రోజువారీ వినియోగానికి బాగుంటాయి. అలాగే పాత చీరలతో ప్యాచ్‌వర్క్ క్విల్ట్ తయారు చేసి చలికాలంలో ఉపయోగించవచ్చు. అలాగే ఫొటోలో చూపించిన విధంగా నాలుగు స్తంభాల బెడ్‌కు చీరతో కానోపీ కూడా తయారు చేయవచ్చు.

55
వాల్ ఆర్ట్‌గా తయారు చేయండి

ఇకట్, ఖాదీ లేదా చేతితో పెయింట్ చేసిన చీరలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రేమ్‌లో పెట్టి వాల్ ఆర్ట్‌గా వాడుకోవచ్చు. వాటిని గోడపై అందంగా అమర్చితే ఇంటికి ప్రత్యేకమైన లుక్ వస్తుంది. ఇది మీ ఇంటిని యూనిక్‌గా చూపించే సులభమైన మార్గం.

Read more Photos on
click me!

Recommended Stories