Sudha Murty Tips : ఈ టైమ్ లో భర్తను ఏదడిగినా కాదనరు..: భార్యలకు సుధామూర్తి చిట్కాలు

Published : Apr 25, 2026, 09:06 PM ISTUpdated : Apr 25, 2026, 09:17 PM IST

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధా దంపతులు తమ నిరాడంబరమైన జీవితానికి, అన్యోన్య దాంపత్యానికి పెట్టింది పేరు. అయితే తాజాగా భార్యలు తమకు ఏదైనా కావాలన్నప్పుడు భర్తను ఏ సమయంలో అడగాలో సుధామూర్తి తెలిపారు... తాను నారాయణమూర్తిని అలాగే అడుగుతానని వెల్లడించారు. 

PREV
14
సుధామూర్తి చిట్కాలు..

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతులు కోటీశ్వరులైనా తమ సింపుల్ లైఫ్ స్టైల్ తో ఆకట్టుకుంటారు. ఇన్ఫోసిస్‌లో ఈ దంపతులు, వారి పిల్లలందరి వాటా కలిపి సుమారు 30 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. అయినా వారు చాలా సాధారణ జీవితం గడుపుతారు. 

సుధామూర్తి అయితే సింపుల్ చీరలు కట్టుకుంటారు… ఎలాంటి బంగారు నగలు ధరించరు. ఎంత డబ్బు, ఆస్తి, హోదా ఉన్నా కూడా వాటిని ఎప్పుడూ బయటకు చూపించకుండా అందరితో కలిసిపోతారు. తన సాధారణ జీవితంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె మనసు పెడితే కోట్లు విలువ చేసే వజ్రాభరణాలు ధరించగలరు… కానీ ఆడంబరాలకు ఆమె చాలా దూరం.

24
భర్తతో ఏ సమయంలో సరే అనిపించుకోవాలంటే..

అయితే అప్పుడప్పుడు సంతోషకరమైన వైవాహిక జీవితానికి కొన్ని చిట్కాలు ఇస్తుంటారు సుధామూర్తి. తాజాగా ఓ సరదా విషయాన్ని ఆమె పంచుకున్నారు. భర్తలు తమ భార్యల మాటలు వినకుండానే 'సరే' అని ఎప్పుడు అంటారో ఆమె చెప్పేశారు.

సుధా మూర్తి ప్రకారం... భర్త పేపర్ చదువుతున్నప్పుడు భార్య ఏం అడిగినా అస్సలు పట్టించుకోరట. వారి పూర్తి ధ్యాస పేపర్ చదవడంపైనే ఉంటుంది.... కాబట్టి భార్య ఏమైనా అడిగితే వెంటనే 'సరే' అనేస్తారట. తాను కూడా ఇలాగే చాలాసార్లు చేశానని చెప్పుకొచ్చారు సుధామూర్తి.

34
నారాయణమూర్తి సరే అనలేరట..

అయితే ఓసారి ఇలాగే నారాయణమూర్తి పేపర్ చదువుతుండగా ఓ గిప్ట్ అడిగానని... కానీ ఆయనతో సరే అనిపించుకోలేకపోయానని ఓ సరదా సంఘటనను సుధామూర్తి బైటపెట్టారు. ‘’'ఎప్పటిలాగే మూర్తి పేపర్ చదువుతుండగా నేను మూడు కోట్ల రూపాయల నగల కొంటానని చెప్పాను. కానీ ఈసారి నేను అనుకున్నది జరగలేదు. నా మాటలు విని వెంటనే మూర్తి పేపర్ పక్కన పెట్టి నాకు చిన్న క్లాప్ పీకారు. ఇంత డబ్బుపెట్టి కొంటే నష్టం ఏమీ లేదు... కానీ నువ్వు 30 రూపాయల వస్తువు కొనడానికే ఆలోచిస్తావు. అలాంటిది 3 కోట్ల రూపాయల నగలు కొంటావా..? అస్సలు కొనవులే..'' అన్నారని సుధామూర్తి తెలిపారు.

44
భార్యభర్తల మధ్య రాజీమార్గం మౌనమే...

గతంలో దాంపత్య జీవితం గురించి సుధా మూర్తి ఓ మంచి సలహా ఇచ్చారు. భార్యాభర్తల గొడవలో ఒకరు కోపంగా ఉన్నప్పుడు, మరొకరు ప్రశాంతంగా ఉండాలి… అస్సలు నోరు తెరవకూడదు. 'మూర్తి (నారాయణ్) కోపంగా ఉన్నప్పుడు, నేను మౌనంగా ఉంటాను. ఆయన ఏది చెప్పాలనుకుంటే అది చెప్పనిస్తాను. నేను మాత్రం మాట్లాడను' అని సుధామూర్తి పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories