Home Decor: పిస్తా తిన్న తర్వాత మిగిలే పెంకులను సాధారణంగా చెత్తలో పడేస్తుంటాం. కానీ అదే పిస్తా పెంకులు కొంచెం సృజనాత్మకతతో అద్భుతమైన గృహాలంకరణ వస్తువులుగా మారుతాయి. తక్కువ ఖర్చుతో ఇంటికి కొత్త లుక్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణ గాజు కప్పు లేదా చిన్న బౌల్ చుట్టూ పిస్తా పెంకులను పూల రేకుల్లా అతికిస్తే అందమైన క్యాండిల్ హోల్డర్ సిద్ధమవుతుంది. లోపల టీ లైట్ లేదా చిన్న కొవ్వొత్తి పెట్టితే వెలుతురు బయటకు అందంగా కనిపిస్తుంది. ఇది బెడ్‌రూమ్, లివింగ్ రూమ్ లేదా బాల్కనీకి ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది.
27
చిన్న మొక్కల కుండీలకు నేచురల్ డిజైన్
పాత ప్లాస్టిక్ లేదా మట్టి కుండీలకు పిస్తా పెంకులు అతికిస్తే అవి పూర్తిగా కొత్తగా కనిపిస్తాయి. పెంకులను సహజ రంగులోనే ఉంచినా బాగుంటుంది. లేకపోతే గోల్డ్, వైట్ లేదా బ్రౌన్ రంగులతో పెయింట్ చేస్తే మరింత స్టైలిష్‌గా మారతాయి. సక్కులెంట్స్ లేదా చిన్న ఇండోర్ ప్లాంట్స్‌కు ఇవి బాగా సరిపోతాయి.
37
గోడలకు వేలాడే డెకరేషన్
పిస్తా పెంకులను వివిధ రంగులతో పెయింట్ చేసి దారానికి గుచ్చి వేలాడదీసే అలంకరణగా తయారు చేయవచ్చు. ఇవి కిటికీలు, బాల్కనీలు లేదా గోడల దగ్గర పెట్టితే గాలి తాకిడికి మెల్లగా కదులుతూ అందంగా కనిపిస్తాయి. చిన్న ఇళ్లలో కూడా ఇది ప్రత్యేకమైన డెకర్ ఫీలింగ్ ఇస్తుంది.
పాత ఫోటో ఫ్రేమ్‌ల అంచులపై పిస్తా పెంకులను అమర్చడం ద్వారా వాటికి రస్టిక్ స్టైల్ లుక్ తీసుకురావచ్చు. పెంకులపై గ్లిట్టర్ లేదా మెటాలిక్ పెయింట్ వేస్తే మరింత ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. ఫ్యామిలీ ఫోటోలు లేదా మెమరీ ఫ్రేమ్‌లకు ఇది బాగా సెట్ అవుతుంది.
57
పిస్తా పెంకులతో వాల్ ఆర్ట్
క్యాన్వాస్ బోర్డు లేదా కార్డ్‌బోర్డ్‌పై పిస్తా పెంకులతో పూలు, చెట్లు లేదా అబ్స్ట్రాక్ట్ డిజైన్లు రూపొందించవచ్చు. ఇవి గోడలకు వేలాడదీసే హ్యాండ్‌మేడ్ ఆర్ట్ పీస్‌లా కనిపిస్తాయి. పిల్లలతో కలిసి చేయడానికి కూడా ఇది మంచి క్రాఫ్ట్ ఐడియా.
67
పిస్తా పెంకులతో అద్దాల అలంకరణ
చిన్న అద్దం చుట్టూ పిస్తా పెంకులను వరుసగా అమర్చితే ఆ అద్దానికి ప్రత్యేకమైన బోర్డర్ డిజైన్ వస్తుంది. ఇది హ్యాండ్‌క్రాఫ్ట్ ఫినిష్ ఇచ్చి ఇంటి డెకర్‌ను మరింత అందంగా మార్చుతుంది.
77
పిల్లల కోసం క్రియేటివ్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్స్
పిల్లలకు ఆర్ట్ & క్రాఫ్ట్ నేర్పడానికి పిస్తా పెంకులు మంచి సాధనం. వాటితో జంతువుల ఆకారాలు, పూల డిజైన్లు, చిన్న బొమ్మలు తయారు చేయవచ్చు. దీంతో పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. అదే సమయంలో వ్యర్థ పదార్థాలను తిరిగి ఉపయోగించే అలవాటు కూడా వస్తుంది.
పిస్తా పెంకులను ఉపయోగించే ముందు ఇవి చేయండి
పెంకులను బాగా కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత వాసన లేకుండా పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే వాడాలి. రంగులు వేయాలనుకుంటే అక్రిలిక్ పెయింట్స్ ఉపయోగిస్తే మంచి ఫినిష్ వస్తుంది. గ్లూ గన్ లేదా ఫెవికాల్‌తో సులభంగా అతికించవచ్చు.