Goa Trip: గోవా వెళ్తే ఈ అడ్వెంచర్ గేమ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు..

Published : May 09, 2026, 09:07 PM IST

Goa Trip: గోవా అంటే చాలా మందికి బీచ్‌లు, పార్టీలు, నైట్‌లైఫ్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ గోవా అడ్వెంచర్ టూరిజం హబ్‌గా కూడా. వాటర్ స్పోర్ట్స్ నుంచి ట్రెక్కింగ్ వరకు, స్కూబా డైవింగ్ నుంచి బంజీ జంపింగ్ వరకు ఎన్నో టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. 

PREV
15
గోవా బీచ్‌ల్లో థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్

కలంగుట్ బీచ్, బాగా బీచ్ వంటి బీచ్‌లు వాటర్ స్పోర్ట్స్‌కు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ జెట్ స్కీయింగ్, పారా సైలింగ్, బనానా బోట్ రైడ్స్, స్పీడ్ బోటింగ్ వంటి ఎన్నో యాక్టివిటీస్ అందుబాటులో ఉంటాయి. సముద్రం మీద వేగంగా ప్రయాణిస్తూ అడ్వెంచర్ ఫీలింగ్‌ను ఆస్వాదించొచ్చు. ఎత్తులో నుంచి సముద్రాన్ని చూస్తూ చేసే పారా సైలింగ్ టూరిస్టులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఈ యాక్టివిటీస్‌ను బాగా ఎంజాయ్ చేయొచ్చు.

25
స్కూబా డైవింగ్‌తో సముద్రం అడుగున మరో ప్రపంచం

గోవాలో స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ కూడా ఇప్పుడు చాలా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా గ్రాండే ద్వీపం సమీప ప్రాంతాల్లో సముద్రం అడుగున రంగురంగుల చేపలు, పగడపు దీవులు చూడొచ్చు. ప్రొఫెషనల్ ఇన్‌స్ట్రక్టర్ల సహాయంతో ట్రైనింగ్ ఇచ్చి డైవింగ్ చేయిస్తారు. మొదటిసారి ప్రయత్నించే వారికి కూడా ఇది సేఫ్‌గా ఉంటుంది. సముద్రం లోపల కనిపించే అందాలు జీవితాంతం గుర్తుండే అనుభూతిని ఇస్తాయి.

35
బంజీ జంపింగ్, జిప్‌లైనింగ్‌తో ఫుల్ థ్రిల్

హై అడ్వెంచర్ ఇష్టపడేవారికి గోవాలో బంజీ జంపింగ్, జిప్‌లైనింగ్, అడ్వెంచర్ పార్క్స్ కూడా ఉన్నాయి. ఎత్తైన ప్రదేశం నుంచి బంజీ జంప్ చేయడం యువతలో బాగా క్రేజ్ సంపాదించింది. అలాగే జిప్‌లైనింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు. రెగ్యులర్ సైట్‌సీయింగ్‌కు భిన్నంగా ఏదైనా కొత్త అనుభూతి కావాలనుకునే టూరిస్టులకు ఇవి బెస్ట్ ఆప్షన్స్‌గా మారుతున్నాయి.

45
దూద్‌సాగర్ ట్రెక్కింగ్‌తో ప్రకృతి మధ్య అడ్వెంచర్

వర్షాకాలంలో గోవా వెళ్లే అడ్వెంచర్ లవర్స్ ఎక్కువగా ట్రెక్కింగ్‌ను ఎంచుకుంటారు. ముఖ్యంగా దూద్ సాగ‌ర్‌ ట్రెక్కింగ్ చాలా ప్రసిద్ధి చెందింది. పచ్చని అడవులు, కొండలు, ప్రకృతి అందాల మధ్య జరిగే ఈ ట్రెక్కింగ్ మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. జలపాతం దగ్గరకు చేరుకున్న తర్వాత కనిపించే దృశ్యం టూరిస్టులను ఆశ్చర్యపరుస్తుంది.

55
కయాకింగ్, ATV రైడ్స్‌తో మరో లెవల్ ఫన్

గోవాలోని మాంగ్రోవ్ అడవులు, బ్యాక్‌వాటర్స్‌లో కయాకింగ్ చేయడం ప్రశాంతతతో పాటు అడ్వెంచర్ ఫీలింగ్‌ను కూడా ఇస్తుంది. నీటిమీద చిన్న బోట్లలో ప్రయాణిస్తూ ప్రకృతిని దగ్గరగా ఆస్వాదించొచ్చు. అలాగే మట్టి రోడ్లు, అడవి మార్గాల్లో జరిగే ATV రైడ్స్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆఫ్‌రోడ్ రైడింగ్ ఇష్టపడేవారికి ఇది మంచి థ్రిల్ ఇస్తుంది. గోవాను బీచ్‌లకు మించి మరో కోణంలో చూడాలనుకునేవారికి ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ తప్పకుండా ట్రై చేయాల్సినవే.

Read more Photos on
click me!

Recommended Stories