సెక్స్ మధ్యలో కండోమ్ చిరిగిపోతే వెంటనే ఏం చేయాలో తెలుసా?

First Published Dec 29, 2022, 10:01 AM IST

నిజానికి కండోమ్ లను ఉపయోగించడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను ఇవి అడ్డుకుంటాయి. అంతేకాదు ఇవి సెక్స్ లో మరింత చురుగ్గా పాల్గొనేలా చేస్తాయి. 
 

condom

ఇప్పుడే పిల్లలు వద్దు అనుకునే వారికి కండోమ్ లు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి జనన నియంత్రణలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అలాగే హెచ్ ఐవి క్లామిడియా, గొనేరియా వంటి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులకు మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి. కండోమ్ లను ఓరల్ సెక్స్, యోని సెక్స్ కు కూడా ఉపయోగించొచ్చు. ఇవి మిమ్మల్ని ఎస్టీడీల నుంచి పాడుతాయి. చాలా మంది కండోమ్ లను ధరించడం వల్ల కంఫర్ట్ గా ఉండదనుకుంటారు. కానీ ఇది కూడా మీరు సెక్స్ లో మరింత చురుగ్గా పాల్గొనేలా చేస్తుందట. అంతేకాదు వీటివల్ల దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశమే ఉండదు.ఇదంతా బానే ఉంది. కానీ సెక్స్ మధ్యలో కండోమ్ లు అప్పుడప్పుడు చిరిగిపోతుంటాయి. అలాంటి సమయంలో వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

condom

వెంటనే సెక్స్ ను ఆపేయండి.. 

సెక్స్ మధ్యలో కండోమ్ లు చిరిగిపోయిన సంగతి తెలసినా.. కొంతమంది దాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. దీనివల్ల వీర్యకణాలు  యోని లోపలికి వెళ్లే అవకాశం ఉంది. అందుకే కండోమ్ లు చిరిగిపోయిన సంగతిని మీ భాగస్వామికి చెప్పి.. సెక్స్ ను ఆపేయండి. ఎందుకంటే దీనివల్ల వీర్యం యోని లోపలికి వెళ్లి గర్భం దాల్చే అవకాశం ఉంది. అందుకే ఇది చిరిగిపోతే వెంటనే సెక్స్ ను ఆపేయండి. 
 

condom

ద్రవాలను శుభ్రం చేయండి

సెక్స్ మధ్యలో కండోమ్ చిరిగిపోతే వెంటనే బాత్ రూం కి వెళ్లండి. మీ యోని, పురుషాంగం, పాయువును సరిగ్గా శుభ్రం చేసుకోండి. సంభోగం తర్వాత క్లీనింగ్ తప్పనిసరి.  దీనివల్ల వ్యాధికారకాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇది మూత్ర మార్గ సంక్రమణ వంటి ఎన్నో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. 
 

condom

భయపడకండి

కండోమ్ చిరిగిపోయిందని చాలా మంది తెగ భయపడిపోతుంటారు. సెక్స్ తర్వాత వీర్యకణాలను తొలగించడానికి మార్కెట్ లో దొరికే ఎన్నో ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ ఇవి అవసరం లేదు. వీటికి బదులుగా జననేంద్రియాలను పూర్తిగా శుభ్రం చేయండి. జననేంద్రియాల భాగంలో ఈ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల చిరాకు, మంట పెడుతుంది. 
 

పీరియడ్స్ టైం ఎప్పుడో గుర్తించండి

సెక్స్ మధ్యలో కండోమ్ చిరిగిపోవడం వల్ల వీర్యకణాలు లోపలికి వెళితే మీరు గర్భందాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి డౌట్ వస్తే మాత్రం మీ పీరియడ్స్ టైంకి అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ  ప్రెగ్నెన్సీ అని తేలితే వెంటనే గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం మంచిది. 
 

condom

కండోమ్స్ చిరిగిపోవడానికి కారణాలు

గడువు తీరిన కండోమ్ లను ఉపయోగించడం వల్ల కూడా సెక్స్ మధ్యలో కండోమ్ చిరిగిపోయే అవకాశం ఉంది. తప్పుగా ఉపయోగించడం, ధరించడం వల్ల లేదా ఉపయోగించిన కండోమ్ ను తిరిగి ఉపయోగించడం వల్ల కూడా ఇలా అవుతుంది. వాలెట్ లో ఉంచిన కండోమ్ లను, సూర్యరశ్మిలో లేదా ఎక్కువ ఉష్ణోగ్రతకు గురైన కండోమ్ లను ఉపయోగిచండం, లూబ్రికేటెడ్ కాని కండోమ్ లను ఉపయోగించడం వల్ల కూడా కండోమ్ లు చిరిగిపోతాయి. 
 

condom

గమనించాల్సిన విషయాలు

అవాంఛిత గర్భధారణను నివారించడానికి కండోమ్స్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అందుకే సెక్స్ కు ముందు, సెక్స్ సమయంలో, ఆ తర్వాత కండోమ్ ల గురించి జాగ్రత్తగా ఉండాలి. కండోమ్ లు మధ్యలో చిరిగిపోకుండా ఉండటానికి నాణ్యత కలిగిన కండోమ్ లనే కొనండి. అలాగే వాటిని ఎలా ధరించాలో సూచనలు చదవండి. ముఖ్యంగా వాటి ఎక్స్ పైరీ డేట్ ను గమనించండి. కండోమ్ లను కూడా నిల్వ చేసుకోవచ్చు. అయితే ఇవి అరిగిపోయే పర్సుల్లో మాత్రం నిల్వ చేయకూడదు. 

click me!