పట్టు: పట్టు వస్త్రాలు చర్మానికి మృదువుగా, హాయిగా ఉంటాయి. పట్టు వస్త్రాలు చర్మానికి రాపిడిని తగ్గిస్తాయి, ముడతలను నివారిస్తాయి. చర్మంపై స్లీప్ లైన్లు, మడతలు ఏర్పడకుండా చేస్తాయి. పట్టు వస్త్రాలకు నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. ఇది చర్మాన్ని చల్లగా, పొడిగా ఉంచడంలో సహాయపడుతుంది.
మెరినో వూల్: మెరినో ఉన్ని మృదువుగా ఉంటుంది. ఇది అన్ని రకాల వాతావరణాలకు అనుకూలమైనది. దుర్వాసనను నిరోధిస్తుంది. ఈ ఉన్ని తేమను గ్రహించి, చెమట నుండి వచ్చే దుర్వాసనను తగ్గిస్తుంది. మెరినో ఉన్ని సహజంగానే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే లక్షణాన్ని కలిగి ఉంటుంది, ఇది దుర్వాసనను నిరోధించడంలో సహాయపడుతుంది.
Bamboo: వెదురు మొక్కల నుండి తయారైన మెటీరియల్ ఇది. ఇది పర్యావరణానికి, చర్మానికి చాలా మంచిది. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల బ్యాక్టీరియా, జెర్మ్స్‌ను ఎదుర్కొంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది. ఇది సహజంగానే UV కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది. దీనివల్ల సూర్యుడి వేడి నుండి మనల్ని కాపాడుతుంది.
లెనిన్: ఈ బట్టలు వేడి వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి. అవి తేలికగా, శ్వాసక్రియకు అనుకూలంగా ఉంటాయి, ఇది చెమటను గ్రహించి వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వీటి ధర ఎక్కువైనప్పటికీ చాలా మంది వీటిని ధరించడానికి ఇష్టపడుతారు.
కాటన్ : కాటన్ దుస్తువులను ఏ కాలంలోనైనా వేసుకోవచ్చు. వీటిని ఉతికే కొద్దీ మృదువుగా మారుతాయి. కానీ ఉతికిన వెంటనే ముడుచుకుపోతాయి. సున్నితమైన చర్మం, అలెర్జీ చర్మం ఉన్నవారికి ప్రత్తి దుస్తులే ఉత్తమం. అయితే, కల్తీ పత్తి లేదా ప్లాస్టిక్ కలిసిన ప్రత్తి దుస్తులకు దూరంగా ఉండాలి.