Aloe Vera: ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. మరి ముఖ్యంగా అమ్మాయిలు తమ జట్టు, చర్మ విషయంలో చాలా కేర్‌గా ఉంటారు. ఇందుకోసం ఖరీదైన, రకరకాల ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. వాటికి బదులు కలబంద ఉపయోగించవచ్చు. కలబందను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
కలబంద మన పెరట్లో పెరిగే ఔషధ మొక్క. ఈ ఔషధ మొక్క చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జట్టు ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు చాలా మంచిది. చర్మంపై వచ్చే దురద, మంటను కలబంద జెల్ తగ్గిస్తుంది. జుట్టుకు కలబంద జెల్ రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది, చుండ్రు సమస్య తీరుతుంది. జుట్టు మెరుస్తూ, మృదువుగా ఉంటుంది. అందుకే ఇళ్లలో కలబందను పెంచుతారు. అయితే.. చాలా మందికి కలబందను సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియదు. చర్మ ఆరోగ్యానికి కలబందను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
25
కలబంద జెల్ తయారీ
ఇంట్లో కలబంద జెల్ తయారీకి.. పచ్చగా, మంచిగా ఉన్న కలబంద ఆకులు వాడటం మంచిది. వాటిని శుభ్రంగా కడిగి, రెండు వైపులా ఉన్న ముళ్ళను తీసేయాలి. తరువాత, ఆకును పొడవుగా చీల్చి, లోపల ఉన్న జెల్ లాంటి పదార్థాన్ని తీయాలి. ఆ జెల్ ను బ్లెండర్ లో వేసి మెత్తగా చేయాలి. ఇలా చేసిన జెల్ ను గాలి చొరబడని డబ్బాలో భద్రపరచి, ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఇందులో ఉండే విటమిన్ E ఆయిల్ జెల్ ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కావాలనుకుంటే.. విటమిన్ E కాప్సూల్స్ వాడుకోవచ్చు.
35
చర్మానికి ఎలా ఆప్లై చేయాలి ?
కలబందను డైరెక్ట్ గా వాడే బదులు ఇందులో అయిల్, తేనే వంటి పదార్థాలను కలపాలి. కలబందలో కొద్దిగా తేనె కలిపి వాడితే.. మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అదే మిశ్రమంలో కొద్దిగా పసుపు కలిపి వాడితే.. మొటిమలను చెక్ పెట్టవచ్చు. జిడ్డు చర్మం ఉంటే, కలబంద బెల్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల సమస్య చాలా త్వరగా పరిష్కారమవుతుంది.
కలబంద జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది, అలాగే జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది, చుండ్రును తగ్గిస్తుంది. జుట్టుకు పోషణను అందిస్తుంది.
కలబందను జట్టుకు ఎలా అప్లై చేయాలంటే..
షాంపూ చేసుకునే ముందు తలకు కలబంద జెల్ రాసుకుని 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. లేదా షాంపూ వాడిన తర్వాత కండీషనర్ కి బదులుగా కొద్దిగా జెల్ రాసుకోవచ్చు. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు ట్రై చేయండి. ఫలితాలు వస్తాయి.
55
ముఖ్యమైన సూచనలు:
మీరు మొదటిసారి కలబంద జెల్ వాడుతున్నట్లయితే, ముందుగా చేతిపై కొద్దిగా రాసి ఏవైనా అలెర్జీలు ఉన్నాయేమో చూసుకోవాలి.
ఇంట్లో తయారుచేసిన కలబంద జెల్ ని ఫ్రిజ్ లోనే నిల్వ చేయాలి. ఫ్రిజ్ లో ఉంచితే 1-2 వారాల వరకు నిల్వ ఉంటుంది. రంగు మారితే లేదా దుర్వాసన వస్తే వాడకూడదు.
ప్రతిసారి కొత్తగా జెల్ తయారు చేసుకుని వాడటం మంచిది. తక్కువ మొత్తంలో తయారు చేసుకుంటే సరిపోతుంది.