హార్ట్ పేషెంట్లు గుడ్లను తినొచ్చా? లేదా?

First Published Oct 19, 2022, 2:52 PM IST

గుడ్డు మంచి ప్రోటీన్ ఫుడ్. ఇతర కాలాలతో పోల్చితే వీటిని శీతాకాలంలోనే ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతా బానే ఉంది కానీ.. హార్ట్ పేషెంట్లు గుడ్లను తినొచ్చా? తినకూడదా? దీనిపై అధ్యయనాలు ఏమంటున్నాయో తెలుసుకుందాం పదండి..
 

egg

గుడ్లు మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచివి. రోజూ ఒకటి లేదా రెండు గుడ్లను ఎలాంటి భయాలు లేకుండా తినొచ్చు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అయితే ప్రతిరోజూ గుడ్లను తినడం వల్ల గుండెకు మంచిదేనా?  లేదంటే గుండె సమస్యలు పెరుగుతాయా? ఒక వేళ హార్ట్ పేషెంట్స్ అయితే గుడ్లను తినొచ్చా? తినాలంటే ఎన్ని తినాలి.. ఎలా తినాలో తెలుసుకుందాం పదండి. 

ఎన్సీబీఐ నివేదిక ప్రకారం.. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లను తిన్నా ఊబకాయం తగ్గుతుంది. క్రమం తప్పకుండా గుడ్లను తింటే శరీరంలోని ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. మన శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు కూడా అందుతాయి.  గుడ్లు ఆకలిని నియంత్రిస్తాయి. దీంతో బరువు తగ్గడం చాలా సులువు అవుతుంది. 
 

ఆరోగ్యంగా ఉండే  ఒక వ్యక్తి ప్రతిరోజూ 2 గుడ్లు తినాలని అనేక పరిశోధనలు చెప్పాయి. ఏదేమైనా చాలా నివేదికలు గుడ్లలో ఇతర ఆహారాల కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందని వెల్లడిస్తున్నాయి. దీనితో వచ్చే సమస్య ఏంటీ? ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో వివరంగా తెలుసుకుందాం..
 

గుడ్లలో ఏయే పోషకాలు ఉంటాయి:  ఒక గుడ్డులో 75 కేలరీలు, 5 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల ప్రోటీన్, 0 కార్బోహైడ్రేట్లు, 70 గ్రాముల సోడియం, 67 మి.గ్రా పొటాషియం, 210 మి.గ్రా కొలెస్ట్రాల్ ఉంటుంది. 

గుడ్లలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి 12 లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో కోలిన్ కూడా  ఉంటుంది. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. 
 

గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ కొలెస్ట్రాల్ గుండె సమస్యలను పెంచుతుంది. దీంతో మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయని చాలా మంది గుడ్లను రోజూ తినకూదని చెబుతుంటారు. అయితే గుడ్లలో కనిపించే కొలెస్ట్రాల్ శరీరంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా దీనిలో ఉండే కొలెస్ట్రాల్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది కూడా.
 

గుడ్లను తినడమే కాదు.. వీటిని ఎలా తింటున్నారనేది ముఖ్యమంటున్నారు నిపుణులు. గుడ్లను ఎక్కువ నూనెలో లేదా వెన్నతో కలిపి తింటే గుడ్ల వల్ల ప్రయోజనాలను కాదు.. నష్టాలను చవి చూడాల్సి వస్తది. ఏదేమైనా.. గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందన్న ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదని తేలిపోయింది. 
 

హార్ట్ పేషెంట్ లు ఎన్ని గుడ్లు తినాలి

హార్ట్ పేషెంట్లు వారానికి 7 గుడ్లు అంటే రోజూ ఒక గుడ్డును తినొచ్చు. అయితే గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తినడం మంచిది. ఎందుకంటే పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది. తెల్లసొన లో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది. వీళ్లు రోజూ రెండు కంటే ఎక్కువ గుడ్లు తింటే.. గుడ్డులోని పచ్చసొనను మొత్తానికే తినకూడదు. గుడ్లను వేయించి కాకుండా ఉడకబెట్టి తినడం మంచిది. వీటిని వండినా తక్కువ నూనె లేదా వెన్నలోనే తినాలి. ఇలా తినడం వల్ల ఎలాంటి హాని జరగదు. గుడ్లు గుండెకు హాని కలిగిస్తాయనే ఆలోచన పూర్తిగా తప్పు అంటున్నారు నిపుణులు.   
 

click me!