అబ్బాయిలూ మీకు ఈ సమస్యలున్నాయా? అయితే నువ్వుల నూనెను తప్పకుండా వాడండి..

First Published Feb 3, 2023, 3:45 PM IST

మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందా? అలాగే లైంగిక సమస్యలు, సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీరు ఖచ్చితంగా నువ్వులను నూనెను తీసుకోవాల్సిందేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును నువ్వుల నూనె పురుషుల్లో ఎన్నో సమస్యలను పోగొడుతుంది. 
 

నువ్వులను ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వాడుతారు. నువ్వులను రకరకాల కూరల్లోనే కాదు లడ్డూల్లో కూడా ఉపయోగిస్తారు. నువ్వులే కాదు నువ్వుల నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా పురుషులకు. అవును నువ్వుల నూనె పురుషులకు చేసే మేలు అంతా ఇంతా కాదు. నువ్వుల నూనెతో పురుషుల్లో ఎన్నో సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

నువ్వుల నూనెలో కాల్షియం, ఫాస్పరస్, జింక్, ఐరన్, మాంగనీస్, కాపర్, ఫోలేట్, థయామిన్, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు నువ్వుల నూనెలో ట్రిప్టోఫాన్ అనే సేంద్రీయ సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది పురుషుల్లో ఎన్నో సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అసలు నువ్వుల నూనె వల్ల పురుషులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది

స్పెర్మ్ కౌంట్ సరిగ్గా లేకుండా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. అంతేకాదు దీనివల్ల వారి లైంగిక జీవితం కూడా దెబ్బతింటుంది. కాగా నువ్వుల నూనె పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. నువ్వులో నూనెలో వీర్యకణాల సంఖ్యను పెంచే ఎన్నో గుణాలు ఉంటాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. 
 

టెస్టోస్టెరాన్ హార్మోన్ ను పెంచుతుంది

టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మనల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు ఈ టెస్టోస్టెన్ హార్మోన్ మెరుగ్గా ఉన్నప్పుడే సెక్స్ ను ఎక్కువ సేపు ఆస్వాదిస్తారు. అయితే నువ్వుల నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సెమినిఫెరస్ ట్యూబ్స్, టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడానికి సహాయపడతాయి.  
 

పురుషుల స్టామినాను పెంచుతుంది

పురుషులు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొంటారు. అయితే పురుషుల స్టామినాను పెంచడానికి నువ్వుల నూనె మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. పురుషుల స్టామినాను పెంచే గుణాలు నువ్వుల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే పురుషులు దీనిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. 
 

అంగస్తంభన సమస్య ఉండదు

ఈ రోజుల్లో చాలా మంది పురుషులు అంగస్తంభన లోపం, జననేంద్రియ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం నువ్వుల నూనెతో జననేంద్రియాలకు మసాజ్ చేయాలి. ఇది రక్తప్రసరణను పెంచుతుంది. అలాగే శరీరాన్ని వేడిగా కూడా ఉంచుతుంది. 
 

వీర్యకణాల సంఖ్య సరిగ్గా లేని వ్యక్తులు, బలహీనంగా ఉన్న, హార్మోన్ల సమస్యలతో బాధపడే పురుషులు తమ ఆహారంలో నువ్వుల నూనెను తప్పకుండా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. సలాడ్లలో డ్రెస్సింగ్ గా నువ్వులను ఉపయోగించొచ్చు. నువ్వుల నూనెను వంటల్లో ఉపయోగించినా ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

click me!