అంజీరతో శృంగార సమస్యలు మటుమాయం.. కానీ వీటిని తినడానికి ముందు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!

First Published Dec 17, 2022, 4:18 PM IST

అంజీర పండ్లను తింటే పురుషుల్లో సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. లైంగిక సమస్యలెన్నో తగ్గిపోతాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుంది. కానీ వీటిని తినడానికి ముందు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకుని తీరాలి. లేకపోతే.. 

అంజీర పండ్ల రుచి టేస్టీగా ఉంటుంది. ఈ పండ్లలో ఎన్నో రోగాలను దూరం చేసే ఔషదగుణాలుంటాయి. అందుకే అంజీరలను ఎక్కువగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. నిజానికి అంజీరలను చాలా మంది డ్రై గానే తినడానికి ఇష్టపడతారు. అంజీరలో కాల్షియం, ఇనుము, రకరకాల విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కార్భోహైడ్రేట్లు, కేలరీలు కూడా బాగానే ఉంటాయి. 
 

anjeer

ఈ పండ్లను ఉదయం  పరిగడుపున తింటే ఆ రోజంతా మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు. ఈ పండు శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి. సోమరితనం దరిచేరకుండా చూస్తుంది. లైంగిక సమస్యలతో బాధపడేవారికి అత్తిపండ్లు బాగా ఉపయోగపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల అకాల స్ఖలనం, తక్కువ  స్పెర్మ్ వంటి లైంగిక సమస్యలు తొలగిపోతాయి. 
 

ఎండిన అంజీరలను ఎలా తినాలి? 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అత్తిపండ్లను పాలలో నానబెట్టి తీసుకుంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. గ్లాస్ పాలు తీసుకుని ఎండిన అత్తిపండ్లను వేయండి. పొద్దున ఈ నానిన అంజీరలను తిని పాలను తాగండి. ఇలా తాగడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. అంజీరలో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపు నొప్పి, మలబద్దకం, అజీర్థి సమస్యల నుంచి బయటపడేస్తుంది. 

లైంగిక సమస్యలతో బాధపడేవారికి అంజీరలు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక కప్పు పాలను తీసుకుని అందులో అత్తిపండ్లను నానబెట్టి ఉదయం తీసుకోండి. ఇది మీ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీరు సెక్స్ లో చురుగ్గా పాల్గొనేలా చేస్తుంది. మీ శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. లైంగిక కోరికలను పెంచుతుంది. పురుషులకే కాదు ఆడవాళ్ల సెక్స్ లైఫ్ పై అత్తిపండ్లు ప్రభావాన్ని చూపుతాయి. 

ఈ విషయం దాదాపుగా అందరికీ తెలుసు.. కానీ ఈ అంజీర పండ్లు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయన్న ముచ్చట మాత్రం తక్కువ మందికే తెలుసు.. ఈ పండులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. అత్తిపండ్లు మంచివే కానీ.. వీటిని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే మన శరీరంలో ఫైబర్ కంటెంట్ పెరిగితే అజీర్థి సమస్య వస్తుంది. ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది. 

click me!