Papaya: బొప్పాయితో వారంలో మెరిసే ముఖం.. ఫేస్ ప్యాక్ ఇలా వేసుకోండి

Published : Aug 07, 2026, 05:29 PM IST

Papaya: ముఖచర్మం మెరిపించడం కోసం  బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలతో కూడా ముఖంపై మెరుపును తెచ్చుకోవచ్చు. బొప్పాయి పండుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది.

PREV
13
కాంతివంతమైన ముఖం కోసం చిట్కాలు

దుమ్ము, ధూళి, కాలుష్యం, పెరిగిన ఒత్తిడి, మారిన లైఫ్‌స్టైల్ వల్ల చాలామంది ముఖంపై కాంతి తగ్గిపోతుంది. దీనికోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్, ట్రీట్‌మెంట్లు వాడతారు. నిజానికి కేవలం బొప్పాయి పండుతో ముఖాన్ని మెరిపించుకోవచ్చు. బొప్పాయిలో చర్మానికి అవసరమైన విటమిన్ ఎ, సి, పపైన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటాయి. అందుకే బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ను వారానికి మూడు నుంచి నాలుగు సార్లు వాడొచ్చు. 

బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడంలో సాయపడుతుంది. అలాగే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మంలో కొల్లాజెన్‌ను పెంచుతాయి. దీనివల్ల చర్మం మరింత మృదువుగా, తాజాగా మారుతుంది. మొటిమల మచ్చలు, ట్యానింగ్ తగ్గడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది.

23
బొప్పాయి ఫేస్‌ప్యాక్ ఇలా

బొప్పాయి ఫేస్‌ప్యాక్ కోసం బాగా పండిన బొప్పాయి ముక్కలు తీసుకోండి. ఈ ముక్కల్ని బాగా మెత్తగా చేసి, అందులో ఒక చెంచా తేనె, అర చెంచా పెరుగు కలపండి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి అరగంట పాటు ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోండి. ఈ ఫేస్‌ప్యాక్‌ను వారానికి మూడు, నాలుగు సార్లు వాడితే ముఖానికి సహజమైన గ్లో వస్తుంది.

33
ట్యాన్, మచ్చలు పోతాయి

ఎండ వల్ల చర్మంపై వచ్చిన ట్యానింగ్‌ను తగ్గించడానికి బొప్పాయి, నిమ్మరసం ఫేస్‌ప్యాక్ బాగా పనిచేస్తుంది. బొప్పాయిలోని ఎంజైమ్‌లు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి. నిమ్మరసంలోని విటమిన్ సి చర్మానికి గ్లో ఇవ్వడంలో సహాయపడుతుంది. అయితే, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు నిమ్మరసం తక్కువగా వాడాలి.

బొప్పాయి ఫేస్‌ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మీకు ఏవైనా అలర్జీలు లేదా చర్మ సమస్యలు ఉంటే, ముందుగా చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసి చూసుకోండి. ఫేస్‌ప్యాక్ కడిగేసిన తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ రాయండి. దీనివల్ల చర్మం పొడిబారకుండా హైడ్రేట్‌గా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories