Clothes Drying: వర్షాకాలంలో దుస్తులు త్వరగా ఆరిపోవాలంటే న్యూస్‌పేపర్ ట్రిక్ ఫాలో అవ్వండి

Published : Aug 07, 2026, 04:56 PM IST

Clothes Drying: వానాకాలంలో దుస్తులు త్వరగా ఆరకుండా ఇబ్బంది పెడతాయి.  సరిగా ఆరకపోతే చెడు వాసన వస్తుంటుంది. ఆ టెన్షన్ లేకుండా ఎండతో సంబంధం లేకుండా సింపుల్ ట్రిక్స్‌తో మీ దుస్తులను పొడిగా మార్చుకోవచ్చు.

PREV
13
వానాకాలంలో దుస్తులు ఆరబెట్టే ట్రిక్స్

వానాకాలంలో ఉతికిన దుస్తులు ఆరక ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా సులువైన టిప్స్ తో దుస్తులు ఆరబెట్టుకోవచ్చు. ముందుగా దుస్తులను నీళ్లు లేకుండా బాగా పిండి, ఒక వైర్‌పై ఆరేయండి. దాని కింద ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టి ఫుల్ స్పీడ్‌లో ఆన్ చేయండి. ష్టర్టులు, ప్యాంటు జేబుల్లో, మడతల మధ్య న్యూస్‌పేపర్ ముక్కలు పెట్టండి. న్యూస్‌పేపర్ తేమను పీల్చుకుంటుంది. ఫ్యాన్ గాలికి నాలుగు గంటల్లో బట్టలు ఆరిపోతాయి. రెండు గంటలకోసారి పేపర్లు మారిస్తే ఇంకా తొందరగా ఆరతాయి.

23
ఐరన్ బాక్స్ ట్రిక్

దుస్తులు సగం ఆరిన తరువాత వాటిని పూర్తిగా పొడిగా ఆరేలా చేయవచ్చు. సగం ఆరిన దుస్తులను పొడిగా ఉన్న మందపాటి టవల్‌పై పరచండి. ఇప్పుడు దానిపై వేడి ఐరన్ బాక్స్‌తో ప్రెస్ చేయండి. టవల్ అదనపు తేమను పీల్చేసుకుంటుంది. ఐరన్ బాక్స్ వేడికి బట్టలు కూడా ఆరిపోతాయి. స్కూల్ యూనిఫాం, జీన్స్ వంటి మందపాటి బట్టలకు ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది. దుస్తుల నుంచి చెడువాసన కూడా రాదు.

33
చెడువాసన రాకుండా..

దుస్తులను నీటిలో జాడించేటప్పుడు చివరిలో కొద్దిగా డెటాల్ లేదా తెల్ల వెనిగర్ కలపండి. ఇది బ్యాక్టీరియాను చంపి, చెడు వాసన రాకుండా చేస్తాయి. అలాగే దుస్తులను ఒకదానిపై ఒకటి కాకుండా, గాలి తగిలేలా కాస్త దూరంగా ఆరేయండి. వర్షాకాలంలో ఎండ కోసం ఎదురుచూస్తే పని జరగదు. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ దుస్తులు తాజాగా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories