Jonna Roti: జొన్న రొట్టెలు పత్తిలాగా మృదువుగా రావాలంటే ఈ చిట్కాలు ఫాలో అయి చూడండి

Published : Nov 03, 2025, 06:28 PM IST

Jonna Roti: జొన్న రొట్టెలు కొంతమందికి చాలా గట్టిగా వస్తాయి. అందుకే వాటిని తినేందుకు ఇష్టపడరు. మెత్తగా రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. చపాతీల్లాగే వీటిని సాఫ్ట్ గా ఎలా చేయాలో తెలుసుకోండి.

PREV
14
జొన్న రొట్టెలు మెత్తగా రావాలంటే

జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ వాటిని చేసుకొని తినేవారు చాలా తక్కువ. అవి గట్టిగా వస్తాయని నమల లేమని చపాతీలే చేసుకుని తింటారు. నిజానికి చపాతీలతో పోలిస్తే జొన్న రొట్టెలు ఆరోగ్యానికి మంచిది. శీతాకాలంలో జొన్న రొట్టెలు తినడం చాలా అవసరం. ఇది చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి చపాతీలాగే జొన్న రొట్టెలు కూడా మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

24
జొన్న రొట్టెల తయారీ

పిండిని పిసకడం దగ్గర నుంచి వాటిని ఒత్తి కాల్చడం వరకు జాగ్రత్తపడితే జొన్న రొట్టెలు కూడా మెత్తగా వస్తాయి. జొన్న రొట్టెలు కూడా చపాతీల్లాగా చేసుకోవడమే అనుకుంటారు. కానీ చపాతీలతో పోలిస్తే జొన్న రొట్టెలు కొంచెం భిన్నంగా చేయాలి. జొన్న రొట్టెలు గట్టిగా క్రంచీగా అయిపోతాయి. అందుకే చాలామంది తినరు. జొన్న రొట్టెల తయారీలో పిండిని సరిగా పిసకడం చాలా ముఖ్యం. దీనికోసం రెండు కప్పుల జొన్నపిండికి పావు కప్పు నీరు అవసరం పడుతుంది. స్టవ్ మీద కళాయి పెట్టి నీటిని వేసి మరిగించండి. నీరు మరిగాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడి నీటిలోనే జొన్న పిండిని వేసి బాగా కలుపుకోవాలి.

34
ఎంత పిసికితే అంత మెత్తన

వేడి నీటిలో బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టి పావుగంట పాటు వదిలేయాలి. ఒకవేళ మీరు అవసరం పడితే పావుగంట తర్వాత ఆ నీటిని చేర్చి మళ్లీ బాగా కలపాలి. పిండిని ఎంత బాగా పిసికితే జొన్న రొట్టెలు అంత మెత్తగా వస్తాయి. కాబట్టి ఓపిక ఉన్నంతవరకు పది నిమిషాలు పాటు జొన్న రొట్టెను పిసికేందుకు ప్రయత్నించండి.

44
ఇలా కాల్చండి

పిండి తయారయ్యాక చిన్నచిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని జొన్న రొట్టెల వచ్చేందుకు చపాతీ పీటపై పిండిని చల్లి రోటీలను ఒత్తండి. మెత్తగా జొన్న రొట్టెలు వచ్చేందుకు స్టవ్ మీద పెనం పెట్టి ముందు వేడి చేయండి. పెనం బాగా వేడెక్కాక జొన్న రొట్టెలను కాల్చండి. రోటీని కాల్చేటప్పుడు మంటను సర్దుబాటు చేసుకోవాలి. తక్కువ మంట మీద కాలిస్తే అవి త్వరగా గట్టిగా మారిపోతాయి. కాబట్టి మీడియం మంట మీద పెట్టి రెండు వైపులా కాల్చండి. చివరిలో నెయ్యి రాసి తీసి పక్కన పెట్టుకోండి. ఇలా చేస్తే జొన్న రొట్టెలు కూడా మెత్తగా వస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories