Weight loss with Flax Seeds: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య అధికంగానే ఉంది. ముఖ్యంగా అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే మీరు బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంతో పెరుగుతో తింటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి.
నేటి కాలంలో అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడేవారు ఎంతో మంది. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోతూ ఉంటారు. ఇలాంటి వారు అవిసె గింజలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెరుగుతో అవిసె గింజలు కలిపి తింటే ఇంకా వేగంగా బరువు తగ్గవచ్చు. పెరుగు అవిసె గింజల కాంబినేషన్ కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇక బరువు తగ్గడానికి అవిసె గింజలు ఎలా తినాలో తెలుసుకోండి.
25
పెరుగుతో తినడం వల్ల...
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు మన పొట్టలోని పేగులను శుభ్రపరుస్తుంది. అలాగే మలబద్ధకానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. అవిసె గింజలు కూడా ఒక సూపర్ ఫుడ్. ఈ గింజల్లో ఫైబర్, ఒమేగా-3, ప్రోటీన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అత్యవసరమైనవి.
35
అవిసె గింజలు ఎలా ఉపయోగపడతాయి?
అవిసె గింజలతో వేగంగా బరువు తగ్గవచ్చు. దీనిలోని ఫైబర్ పొట్ట నిండిన ఫీలింగ్ త్వరగా ఇస్తుంది. ఇది ఇతర ఆహారాలు తినకేండా ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి వాపు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. కాబట్టి అవిసె గింజలు ఎంతో ఆరోగ్యకరం.
పెరుగుతో అవిసె గింజలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక కళాయిలో రెండు చెంచాల అవిసె గింజలను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 4 చెంచాల తక్కువ కొవ్వు ఉన్న పెరుగులో ఈ పొడిని వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ పరగడుపున తింటే అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని రోజుల్లోనే బరువు తగ్గుతారు.
55
ఎవరు తినకూడదు?
అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ అందరూ వీటిని తినకూడదు. ముఖ్యంగా మలబద్ధకం, విరేచనాలు, హార్మోన్ల సమస్య, రక్తస్రావం, తక్కువ రక్తపోటు, తక్కువ చక్కెర సమస్య ఉన్నవారు అవిసె గింజలు తినడం మంచిది కాదని అంటారు. వీటిని తినే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి.