ముఖంపై ముడతలు, మొటిమలు పోవాలంటే ఓట్స్ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఓట్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు ముఖంపై ముడతలను నివారించి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సాయపడతాయి.
రెండు చెంచాల ఓట్స్, ఒక చెంచా పెరుగు, ఒక చెంచా తేనె కలిపి ముఖానికి రాయండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి.
రెండు చెంచాల ఓట్స్‌లో ఒక చెంచా తేనె, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసి మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి.
రెండు చెంచాల ఓట్స్‌లో అర చెంచా పసుపు, కొద్దిగా నీళ్లు కలిపి మిశ్రమంలా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.
పండిన బొప్పాయి గుజ్జులో రెండు చెంచాల ఓట్స్, ఒక చెంచా బాదం నూనె కలిపి మిశ్రమంలా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.
ఒక చెంచా కలబంద గుజ్జు, రెండు చెంచాల ఓట్స్ కలిపి మిశ్రమంలా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయండి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోండి.
ఈ కథనం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏషియానెట్ న్యూస్ ఈ సమాచారానికి బాధ్యత వహించదు. మరింత సమాచారం కోసం నిపుణులను లేదా మీ వైద్యులను సంప్రదించండి.
ఈజీగా బరువు తగ్గాలా? రోజూ ఇవి తిన్నా చాలు
రూమ్ హీటర్ వాడుతున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
ఎముకలు బలంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? ఇవి తింటే చాలు