60 ఏళ్లు వచ్చినా..యంగ్ గానే ఉండాలనుకుంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే

Published : Jun 17, 2025, 05:35 PM IST

గుడ్డు తెల్లసొన, పచ్చసొన, పెరుగు కలిపి తయారుచేసే ఫేస్ మాస్క్‌తో సహజంగా చర్మం మెరిసిపోతుంది.వైద్య నిపుణులు సూచించిన ఈ ఫేస్ మాస్క్ ని ఇంట్లోనే తయారు చేసుకొని నవ యవ్వనంగా మారిపోండి. 

PREV
15
ఇంట్లోనే తయారుచేసుకునే ఫేస్ మాస్క్‌

చర్మ సంరక్షణ అంటే ఖరీదైన క్రీములు, ట్రీట్‌మెంట్‌లు అనే భావనను కొందరు వైద్య నిపుణులు తిరస్కరిస్తున్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆయన, కీటో డైట్ మరియు ఫాస్టింగ్ విషయంలో ప్రసిద్ధి గాంచిన డాక్టర్. ఇప్పుడు ఆయన తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారుచేసుకునే ఫేస్ మాస్క్‌ను సూచిస్తున్నారు. ఇది మొటిమలు, నల్ల మచ్చలు, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తూ, చర్మాన్ని సహజంగా బిగుతుగా,  ప్రకాశవంతంగా మారుస్తుంది.

25
గుడ్డు తెల్లసొన

గుడ్డు తెల్లసొనతో చర్మానికి చక్కని చికిత్స ఈ మాస్క్ తయారీ చాలా సులభం.

ముందుగా, ఒక గుడ్డులోని తెల్లసొనను గిన్నెలో తీసుకొని బాగా కొట్టాలి.దానిని ముఖంపై పలుచగా రాసుకోవాలి.ఇది 15 నుండి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.తెల్లసొనలో ఉండే పోషకాలు చర్మ రంధ్రాలను బిగించి, తక్షణ ఫర్మింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. ఇది ముఖ్యంగా చర్మం సడలినట్లుగా అనిపించే వారికి ఉపయోగపడుతుంది.

35
గుడ్డు పచ్చసొన + పెరుగు = రెండింతల ప్రయోజనం!

 మరింత మెరుగైన ఫలితాల కోసం, మీరు గుడ్డు పచ్చసొనను కూడా జోడించవచ్చు. దీనిలో విటమిన్లు A, D, E, K,  B గ్రూప్ విటమిన్లు, కోలిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి జీవం పోసేలా చేస్తాయి. ఇక ఒక టీస్పూన్ ఆర్గానిక్ పెరుగు చేర్చితే, మీ చర్మం మైక్రోబయోమ్‌కు మద్దతు లభించి, చర్మ సమతుల్యత మెరుగవుతుంది. ఇది సహజమైన మెరుపును ప్రోత్సహిస్తుంది.

45
లోపల నుంచి వెలుపలకి ఆరోగ్యం

గుడ్లు తినడం కూడా చర్మ ఆరోగ్యానికి మంచిదే. గుడ్లు సూపర్‌ఫుడ్‌ గాను, అధిక నాణ్యత గల ప్రొటీన్ల మూలంగా చెప్పుకొవచ్చు. ఆలివ్ నూనె, వెన్న లేదా కొబ్బరి నూనెలో గుడ్లను వేయించడం వల్ల అదనంగా శక్తివంతమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి.

55
వారంలో రెండు సార్లు

 ఈ ఫేస్ మాస్క్‌ను వారంలో రెండు సార్లు వాడండి. సహజమైనదైనా, గుడ్డు పట్ల అలెర్జీ ఉన్నవారు వాడే ముందు పరీక్షించుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories