
30 ఏళ్లు దాటాయి అంటే...మన శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. పని ఒత్తిడి, లైఫ్ స్టైల్, మన ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి వంటి కారణాల వల్ల మన ఆరోగ్యంలో నెమ్మదిగా మార్పులు వస్తూ ఉంటాయి. ఈ వయసు దాటిన తర్వాత చాలా మంది తమ హెల్త్ పై పెద్దగా శ్రద్ధ పెట్టరు. కేవలం 30 ఏళ్లకే ముసలివాళ్లం అయిపోతామా? తమ హెల్త్ కి వచ్చిన సమస్య ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ.. మూడు పదుల వయసు దాటింది అంటే చాలా సమస్యలు రావడానికి రెడీగా ఉంటాయి. అందుకే.. ముందుగానే కొన్ని హెల్త్ చెకప్ లు చేయించుకోవాలి. ఇలా ముందుగా చెకప్ చేయించుకోవడం వల్ల, భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించడానికి హెల్ప్ చేస్తాయి.
1. బ్లడ్ షుగర్ టెస్ట్ (Blood Sugar Test)
డయాబెటిస్ ఇప్పుడు కేవలం వృద్ధుల సమస్య మాత్రమే కాదు. యువతలో కూడా ఇది వేగంగా పెరుగుతోంది. ఖాళీ కడుపుతో, భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయులను తెలుసుకోవడం ద్వారా షుగర్ మొదటి దశలోనే గుర్తించవచ్చు. ఈ టెస్టుకి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు.
2. బ్లడ్ ప్రెజర్ చెకప్ (Blood Pressure Check)
హై బ్లడ్ ప్రెజర్ చాలా సార్లు లక్షణాలు చూపదు కానీ హృదయ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం. ప్రతి ఆరు నెలలకు ఒకసారి బీపీ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
కొలెస్ట్రాల్ స్థాయులను తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అవసరం. అధిక కొలెస్ట్రాల్ హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుంది. 30 తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి లిపిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
4. థైరాయిడ్ టెస్ట్ (Thyroid Function Test)
మహిళల్లో థైరాయిడ్ సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. అలసట, బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపించాయి అంటే..వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ థైరాయిడ్ ఉన్నట్లు రిపోర్ట్ లో వస్తే.. దానికి తగినట్లు మెడిసిన్ తీసుకోవాలి.
5. లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (Liver & Kidney Function Tests)
ఆహార అలవాట్లు, కొన్ని రకాల మందుల వాడకం, మద్యం తాగే అలవాటు వంటి కారణాలతో లివర్, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వీటి పనితీరు సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ టెస్టులు అవసరం.
ఇప్పుడు చాలా మందిలో ఈ రెండు విటమిన్ల లోపం సాధారణం అయిపోయింది. ఇవి ఎముకల బలానికి, నాడీ వ్యవస్థ పనితీరుకు చాలా అవసరం. వీటి స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు అలసట, కీళ్ళ నొప్పులు, బలహీనత వంటి సమస్యలు వస్తాయి.
7. పాప్ స్మియర్ టెస్ట్ (Pap Smear Test - For Women)
మహిళలు సర్వైకల్ కేన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి ఈ టెస్ట్ చేయించుకోవాలి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవడం సురక్షితమైన మార్గం.
8. ప్రోస్టేట్ టెస్ట్ (Prostate Test - For Men)
పురుషుల్లో 30 దాటిన తర్వాత ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ (PSA) టెస్ట్ ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు.
9. కళ్లు, డెంటల్ చెకప్ (Eye & Dental Checkups)
కంప్యూటర్, మొబైల్ వాడకం ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. అలాగే దంత సంరక్షణ కూడా చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం ఒకసారి ఈ రెండు పరీక్షలు చేయించుకోవాలి.
10. ఫుల్ బాడీ చెకప్ (Annual Full Body Checkup)
మొత్తం ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి సంవత్సరానికి కనీసం ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఫైనల్ గా...
30 ఏళ్లు అంటే జీవితం మొదలైన దశ. ఈ వయసులో తీసుకున్న జాగ్రత్తలు తర్వాతి దశలో మంచి ఆరోగ్యానికి పునాది వేస్తాయి. క్రమం తప్పకుండా ఈ హెల్త్ టెస్టులు చేయించుకోవడం ద్వారా చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా నివారించవచ్చు. గుర్తుంచుకోండి — “Prevention is always better than cure.”