ఇండియాలోనే యూరప్ చూడాలా? ఈ ప్లేసులకు వెళితే చాలు..!

Published : Oct 23, 2025, 03:41 PM IST

Travel:  లైఫ్ లో ఒక్కసారి అయినా యూరప్ యాత్రకు వెళ్లాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ అంత బడ్జెట్ అందరి దగ్గరా ఉండకపోవచ్చు కానీ, యూరప్ ని చూసినట్లుగానే అనిపించే కొన్ని ప్రదేశాలు మన ఇండియాలో కూడా ఉన్నాయి.  

PREV
17
యూరప్ దాకా వెళ్లక్కర్లేదు...

ట్రావెలింగ్ ని ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. హాలీడే దొరికితే చాలు.. ఏదో ఒక ప్లేస్ కి వెళ్లిపోయే వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే.. ఎక్కువ మందికి విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ దానికి చాలా డబ్బులు కావాలని, తమ దగ్గర అంత బడ్జెట్ లేదని ఆగిపోతూ ఉంటారు.  కానీ, మంచు ప్రదేశాలు, పర్వతాలు, లోయలను ఇష్టపడే వారు స్విట్జర్లాండ్, యూరప్ వెళ్లాల్సిన అవసరం లేదు. మన దేశంలో కూడా అంతకు మించిన అందమైన ప్రదేశాలు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా చూాడాల్సిన ప్రదేశాలు ఇప్పుడు చూద్దాం..

27
అలెప్పి

మీకు వెనిస్ వెళ్లాలని ఉందా? అలాంటి ఫీలింగ్ మను అలెప్పిలో కూడా దొరుకుతుంది. కేరళలోని అలెప్పి ని తూర్పు వెనిస్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ బ్యాక్ వాటర్ కి కొదవే ఉండదు. ఇక్కడ బోట్ హౌస్ లో ప్రయాణిస్తూ కొబ్బరి చెట్లు, చుట్టు పక్కల గ్రామాలను చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది. 

37
పుదుచ్చేరి

గ్రీస్‌లోని తెలుపు, నీలం రంగు ఇళ్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పుదుచ్చేరిలోనూ ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడి వీధుల్లో నడుస్తూ, బీచ్ లో విశ్రాంతి తీసుకోవచ్చు.

47
ఉదయ్ పూర్..

ప్రేమ నగరమైన పారిస్‌తో పోటీపడే భారతీయ నగరం ఉదయ్‌పూర్. సరస్సులు, ప్యాలెస్‌లు, అందమైన సూర్యాస్తమయాలు ఇక్కడి ప్రత్యేకతలు. ప్రేమించిన వారితో వెళితే ఈ ప్రదేశాన్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు.

57
కూర్గ్

స్కాట్లాండ్‌లాగే కర్ణాటకలోని కూర్గ్‌లో పచ్చదనం, కొండలు, కాఫీ తోటలు ఉన్నాయి. ఉదయాన్నే పొగ మంచు కురుస్తూ ఉంటుంది. మార్నింగ్ అక్కడ నడుస్తుంటే మంచి ఫీల్ కలుగుతుంది.  కాఫీ రుచి కూడా అద్బుతంగా ఉంటుంది. 

67
జైపూర్

ప్రేగ్, జైపూర్ రెండూ చారిత్రాత్మక నగరాలు. ప్రేగ్‌లో కోటలు, పాత వీధులు ఉంటే, జైపూర్‌లో కోటలు, ప్యాలెస్‌లు, రంగురంగుల మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది.

77
గోవా

గోవా అందమైన బీచ్‌లకు, సముద్ర దృశ్యాలకు ప్రసిద్ధి. దక్షిణ గోవాలోని ప్రశాంతమైన బీచ్‌లు, ఉత్తర గోవాలోని కేఫ్‌లు ఇటలీలోని అమాల్ఫీ తీరం లాంటి ప్రశాంత వాతావరణాన్ని అందిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories