Jaggery: చలికాలంలో ప్రతిరోజూ చిన్న బెల్లం ముక్క తింటే ఈ రోగాలేవీ రావు

Published : Nov 06, 2025, 02:00 PM IST

Jaggery: బెల్లం తీపిగా ఉండటమే కాకుండా  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. అందుకే చలికాలంలో బెల్లం తినాల్సిన అవసరం ఉంది. చిన్న బెల్లం ముక్క తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసుకోండి.

PREV
16
బెల్లంతో ఆరోగ్యం

ప్రాచీన కాలం నుంచి భారతీయులు బెల్లాన్ని తినడం ప్రారంభించారు. దానిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. నిజానికి పంచదార కన్నా బెల్లం వాడడం అన్నింటికన్నా ఉత్తమం. చక్కెర వాడకం వల్ల ఎన్నో ఆరోగ్య నష్టాలు కలుగుతాయి. బెల్లం సహజసిద్ధమైన తీపిని కలిగి ఉంటుంది. దీనివల్ల అనారోగ్యాలు ఏవీ రావు. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఖనిజాలు ఉంటాయి. అందుకే చలికాలంలో చిన్న ముక్క బెల్లం తినడం చాలా అవసరం. దీని వల్ల శరీరానికి పోషకాలు అందడంతో పాటూ రోగనిరోధక శక్తి పెరిగి కొన్ని వ్యాధులు రాకుండా ఉంటాయి.

26
జలుబు రాదు

తరచుగా జలుబుతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ  చిన్న బెల్లం ముక్క తింటే మంచిది. ముఖ్యంగా చలికాలంలో బెల్లం తినడం వల్ల అది మీ శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. అలాగే ఇది చలికాలపు వ్యాధులను రాకుండా అడ్డుకోవడంలో కూడా ఇది సహాయపడుతుంది.

36
రక్తహీనత రాదు

బెల్లంలో ఐరన్ తో పాటూ వివిధ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజూ బెల్లంగా ముక్క తినాల్సిందే, రోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ఉత్పత్తి మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది.

46
కడుపుబ్బరం

చలికాలంలో భారీ భోజనాలు తిన్నాక కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారుభోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినాలి. రోజూ బెల్లం తినడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

56
రోగనిరోధక శక్తికి

చలికాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. కాబట్టి ప్రతిఒక్కరూ బెల్లం తినాల్సిందే. బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు మనకు ఎంతో అవసరం. బెల్లం తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇది అనారోగ్యం బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తుంది.

66
చర్మానికి మెరుపు

రోజూ బెల్లం తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, రక్తం శుద్ధి అవుతుంది. మహిళల్లో మొటిమలు రాకుండా ఉంటాయి.  మీ చర్మం మెరుస్తుంది. జుట్టు బలపడుతుంది. అందుకే పోషకాల కోసం చక్కెర బదులు బెల్లం వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories