ఒక ఫ్యాషన్ ఇన్ఫుయెన్సర్ ఒకరు ప్రాడా కంపెనీ తయారు చేసిన ఈ సేఫ్టీ పిన్ గురించి ఒక వీడియో చేశారు. దానిలో దీని ధర 775 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలోకి మారిస్తే దాదాపు రూ.69,000 గా ఉండటం విశేషం. అయితే... ప్రస్తుతం ఈ సేఫ్టీ పిన్ గురించి చేసిన వీడియో వైరల్ గా మారగా... నెటిజన్ల రియాక్షన్ అదిరిపోయింది.
నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ అదిరిపోయాయి. ఎక్కువ మంది.. ఈ సేఫ్టీ పిన్ ని ఎవరు కొంటున్నారు? ఆ కొనేవారి డీటైల్స్ చెప్పండి ప్లీజ్ అంటూ కామెంట్స్ చేయడం విశేషం. ఈ ప్రాడా అనేది 1913లో మారియో ప్రాడా స్థాపించిన ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్. ఇది హ్యాండ్ బ్యాగులు, బూట్లు, ఫ్యాషన్ వస్తువులను విక్రయిస్తూ ఉంటుంది.