ఇవి తిన్నా చాలు.. మీ దంతాలు తెల్లగా మిళమిళ మెరిసిపోతాయి..

First Published Aug 16, 2022, 3:53 PM IST

కొన్ని రకాల ఆహారాలను తిన్నా.. మీ దంతాలు తెల్లగా మిళమిళ మెరిసిపోతాయి. ఇవి మీ దంతాలను ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. 
 

నవ్వుతోనే వంద మందిని కలుపుని పోవచ్చంటారు పెద్దలు. మరి ఆ నవ్వుకు దంతాలే అందం. నవ్వితే దంతాలన్నీ కనిపిస్తాయి. మరి నవ్వినప్పుడు మీ దంతాలు పచ్చగా కనిపిస్తే.. అందరూ అసహ్యంగా చూస్తారు. నిజానికి దంతాలను సరిగ్గా క్లీన్ చేసుకోనివారికే పచ్చగా ఉంటాయి. దంతాల క్లీనింగ్ తోనే మీ ఆరోగ్యం బాగుంటుంది. అందుకే రోజూ సరిగ్గా బ్రష్ చేసుకోవాలి. బ్రష్ తో పాటుగా కొన్ని రకాల ఆహారాలను తిన్నా మీ దంతాలు తెల్లగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. అవేంటంటే.. 
 

ఆపిల్స్

ఆపిల్స్ తో ఆరోగ్యమే కాదు.. దంతాలు కూడా తెల్లగా మెరిసిపోతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆపిల్స్ తినడం వల్ల దంతాల ఎనామెల్ ను క్లీన్ అవుతుంది. అలాగే దంతాలు తెల్లగా మెరుస్తాయి. ఈ పండు నోట్లో లాలాజలాన్ని పెంచి.. బ్యాడ్ స్మెల్ ను కూడా పోగొడుతుంది.  ఈ పండును రెగ్యులర్ గా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. దంతాలు కూడా తెల్లగా ఉంటాయి. 
 

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ సి దంతాలను తెల్లగా మెరిపించడానికి సహాయపడుతుంది. ఇది Salivation పెంచుతుంది. దీనివల్ల నోటిలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా సంఖ్య తగ్గుతుంది. ఎంత పచ్చగా ఉన్న దంతాలనైనా ఈ పండ్లు తెల్లగా మారుస్తాయి. అయితే వీటిని రెగ్యులర్ గా తినాల్సి ఉంటుంది. 
 

పైనాపిల్

ఈ పండులో శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన  ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటుగా దంతాలను ఆరోగ్యంగా, తెల్లగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. దీనిలో నోటిలోని బ్యాక్టీరియా పెరుగుదలను ఆపే  బ్రొమెలైన్ ఎంజైమ్ అధికంగా ఉంటుంది. ఇది మీ పళ్లను తెల్లగా మార్చడంతో పాటుగా చిగుళ్ల వాపును కూడా తగ్గిస్తుంది. 
 

చీజ్

చీజ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎముకలను, దంతాలను బలంగా ఉండే కాల్షియం తో పాటుగా కొవ్వులు కూడా ఎక్కువగా ఉంటాయి.  చీజ్ ను కొద్ది మొత్తంలో రోజూ తింటే ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ఇది దంతక్షయం సమస్యను కూడా తగ్గిస్తుంది. 
 

పుట్టగొడుగులు

పుట్టగొడుగుల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా అవసరం. దీనివల్లే మన శరీరం కాల్షియాన్ని గ్రహిస్తుంది. ఈ విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది పళ్లను గట్టిగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.  వీటిని తరచుగా తింటే దంతాలు తెల్లగా మెరుస్తాయి. 

click me!