దోమకాటుకు ఆయిల్ దెబ్బ.. ఇంట్లోనే ఈజీగా మస్కిటో రెపల్లెంట్స్...

First Published Jun 3, 2021, 1:23 PM IST

వర్షాలు మొదలయ్యాయి. ఇక దోమలదండు దండెత్తుతుంది. కరోనాకు తోడు డెంగీ, మలేరియా లాంటి జ్వరాలు విరుచుకుపడతాయి. అలాగని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటిని ఆపలేం. తలుపులకు మెష్ డోర్లు, ఆల్ అవుట్లు, దోమల అగరబత్తులు ఇలా ఎన్నిరకాలు జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడినుంచో గుయ్ మంటూ సంగీతం వినిపిస్తూనే ఉంటాయి.

వర్షాలు మొదలయ్యాయి. ఇక దోమలదండు దండెత్తుతుంది. కరోనాకు తోడు డెంగీ, మలేరియా లాంటి జ్వరాలు విరుచుకుపడతాయి.
undefined
అలాగని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటిని ఆపలేం. తలుపులకు మెష్ డోర్లు, ఆల్ అవుట్లు, దోమల అగరబత్తులు ఇలా ఎన్నిరకాలు జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడినుంచో గుయ్ మంటూ సంగీతం వినిపిస్తూనే ఉంటాయి.
undefined
ఇక బైటికి వెళ్లేవాళ్ల పరిస్తితి మరీ దారుణం ఒక్కచోట పదినిముషాలు కుదురుగా నిలబడలేరు. దోమలు కుట్టికుట్టి చంపేస్తాయి. కొన్ని వంటింటి చిట్కాలతో వీటిని కొంతమేర తట్టుకోవచ్చు. ఇంట్లోనే తయారుచేసుకోగలిగే ఈ మస్కిటో రిపల్లెంట్స్ ఇవి..
undefined
పిప్పరమింట్ నూనె, కొబ్బరి నూనె : సహజంగానే పిప్పరమింట్ నూనె దోమలను తరిమి కొడుతుంది.
undefined
దీన్ని కొబ్బరి నూనెతో కలపడం వల్ల దోమలను తరిమే సామర్థ్యం మరింత పెరుగుతుంది. కొబ్బరి నూనె కూడా సహజంగానే దోమల్ని తరిమికొట్టే సామర్థ్యం కలిగి ఉంటుంది.
undefined
లెమన్ యూకలిప్టస్ ఆయిల్.. ఒక భాగం లెమన్ యూకలిప్టస్ రెండు భాగాలు కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ లాంటి క్యారియర్ ఆయిల్స్ కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని దోమలు కుట్టకుండా స్ప్రే చేసుకోవచ్చు. లేదా దోమలు కుట్టిన ప్రాంతంలో రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
undefined
లెమన్ యూకలిప్టస్ ఆయిల్ లో సిట్రోనెల్, పి-మీథేన్ 3,8-డయోల్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. సిట్రోనెల్ లో దోమలను వికర్షించే గుణం ఉంది. ఈ పిఎండి దోమలకు వ్యతిరేకంగా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
undefined
వేప నూనె : కొబ్బరి నూనెతో కలిపిన వేప నూనె దోమలకు వికర్షకంగా బాగా పనిచేస్తుంది. 2 శాతం శాతం వేప నూనె, కొబ్బరి నూనెతో కలిపి వాడినప్పుడు దోమలను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.
undefined
టీ ట్రీ ఆయిల్ : టీ ట్రీ ఆయిల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. దీని క్రిమినాశక లక్షణాలు గాయాలను నయం చేయడంలో సహాయపడతాయి.
undefined
టీ ట్రీ ఆయిల్ గాఢమైన వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. అయితే, ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె వంటి క్యారియర్ నూనెతో కలిపి వాడాలి.
undefined
click me!