మటన్‌ని ఎప్పుడూ కర్రీ, ఫ్రై, బిర్యానీ చేసి బోర్ కొట్టిందా? ఈసారి కాస్త వెరైటీగా, అందరికీ నచ్చేలా మటన్ కీమా బోండాలు తయారు చేసి చూడండి. మటన్ కీమాకు మసాలాలు జోడించి బోండాల్లా తయారు చేసి వేయిస్తే బయట క్రిస్పీగా, లోపల మెత్తగా, రుచిగా ఉంటాయి. ఒక్కసారి ప్లేట్‌లో పెట్టారంటే పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుంటూ తినేస్తారు. సాయంత్రం టైమ్ స్నాక్‌గా ఇది చక్కగా సరిపోతుంది. మరి నోరూరించే ఈ మటన్ కీమా బోండాలను ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఈ కీమా బోండా చేయడానికి, ముందుగా కీమాను శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. కుక్కర్‌లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కీమాను మెత్తగా ఉడికించాలి. ఉడికిన తర్వాత నీళ్లు వంపేసి, కీమాను పొడిపొడిగా చేసుకోవాలి. పిల్లలు తినడానికి వీలుగా కైమాను చిన్నగా ఉండేలా చూసుకోవాలి.