ఈ పక్షికి ఉన్న అత్యంత విచిత్రమైన అలవాటు ఏమిటంటే..ఇది సరస్సులు, నదులు లేదా చెరువుల్లో ఉండే నేల నీటిని అస్సలు తాగదు. పక్షి నోటి నిర్మాణం, దాని సహజసిద్ధమైన ప్రవర్తన ప్రకారం, ఇది కేవలం ఆకాశం నుండి కురిసే వర్షపు బిందువులను మాత్రమే నేరుగా తన నోటితో పట్టుకుని తాగుతుంది. వర్షం పడనంత వరకు ఇది తన దాహాన్ని ఆపుకుని, ఆకాశం వైపు చూస్తూ నిరీక్షిస్తుంది. అందుకే సంస్కృతంలో దాహం కోసం నిరీక్షించే వారిని 'చాతక పక్షి'తో పోలుస్తారు.
సొంత గూడు కూడా కట్టుకోని పక్షి..
ఈ పక్షికి ఉన్న మరో ఆసక్తికరమైన లక్షణం... ఇది కోకిల జాతికి చెందింది. కాబట్టి ఇది సొంతంగా గూడు కట్టుకోదు.వర్షకాలంలో తన గుడ్లను ఇతర చిన్న పక్షుల గూళ్లలో రహస్యంగా పెట్టి వదిలేస్తుంది.ఆ వేరే పక్షులే వీటి గుడ్లను పొదిగి, పిల్లలను పెంచుతాయి.
వర్షపు నీరు దొరక్కపోతే ఏమవుతుంది? వర్షాలు లేని సమయంలో ఇది తన శరీరానికి అవసరమైన తేమను ఆకులు, చెట్లపై ఉండే చిన్న చిన్న పురుగులు, కీటకాలను తినడం ద్వారా పొందుతుంది. కానీ ద్రవ రూపంలో నీటిని తాగాల్సి వస్తే మాత్రం కేవలం వర్షపు చుక్కల పైనే ఆధారపడుతుంది.